Love journey movie releases on 16 th of this month in a big way

love journey movie, releases, on 16 th of this month in a big way

love journey movie releases on 16 th of this month in a big way

20.gif

Posted: 03/09/2012 06:46 PM IST
Love journey movie releases on 16 th of this month in a big way

          love_innerఓ కుర్రాడి విలక్షణ ప్రేమ ప్రయాణానికి రంగం సిద్ధం అయింది. ఈ జర్నీ ఈనెల 16 నుంచి నిరాటంకంగా సాగనుంది. అందనిది అందినట్లుగా డైరీలో రాసుకుంటూ తియ్యని అనుభూతికి లోనయ్యే ఓ యువకుడి ప్రేమకథ సినిమా రూపంలో ‘లవ్ జర్నీ’గా రానుంది.  హీరోగా.. జై (జర్నీ ఫేం), హీరోయిన్స్ గా కలర్స్ స్వాతి, షాజన్ పదమ్సీ నటించిన తమిళ చిత్రం కనిమొళి ని తెలుగులోకి ‘లవ్ జర్నీ’ గా అనువదించారు.

           శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను స్పింట్ టెలీఫిలింస్ డైరెక్టర్ తిరుమల రెడ్డి సమర్పణలో జెఎన్ఆర్ పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై జక్కుల నాగేశ్వర రావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. love_22
          ఈ మూవీ గురించి గీత రచయిత వెన్నలకంటి ఇలా అంటున్నారు : ‘‘ వెంకట్ ప్రభు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన రంగస్వామి ఈ చిత్రాన్ని ఎంతో హ్రుద్యంగా చిత్రీకరించారు. ఇందులోని నాలుగు పాటలలో తాను మూడింటిని రాశానని ఒకటి భువన చంద్ర రాశారని ప్రేర్కొన్నారు’’ .

            ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అమరనేని రామ కృష్ణ మాటల్లో : ‘‘సంగీత దర్శకుడు సతీష్ చక్రవర్తి పాటలతో పాటు రీరికార్డింగ్ కూ ప్రాణం పోశారని, ఇది ఫీల్ గుడ్ చిత్రంగా ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది’’.

Love_Journey_2          డిఫెరెంట్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘లవ్ జర్నీ’ సినిమాకు మాటలు : శశాంక్ వెన్నెలకంటి. పాటలు : వెన్నెలకంటి, భువనచంద్ర. సంగీతం : సతీష్ చక్రవర్తి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అమరనేని రామ కృష్ణ.  సహనిర్మాత : మాస్టర్ ఉదయ్ తేజ. నిర్మాణ సారథ్యం : జక్కుల సుజాత. సమర్పణ : తిరుమల రెడ్డి.  నిర్మాత : జక్కుల నాగేశ్వరరావు.  దర్శకత్వం : శ్రీపతి రంగస్వామి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada as mother in svsc
14gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles