Balakrishna warns prabhu deva

Balakrishna warns Prabhu Deva,Nayantara and Prabhu Deva,Telugu star Balakrishna

Balakrishna warns Prabhu Deva

Balakrishna.gif

Posted: 02/16/2012 05:34 PM IST
Balakrishna warns prabhu deva

Balakrishna warns Prabhu Deva

బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు వచ్చి విజయవంతమయ్యాయి. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ప్రభుదేవా, నయనతార వ్యవహారంలో బాలకృష్ణ జోక్యం చేసుకుని వార్నింగ్ ఇచ్చాడని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. నయనతారకు మంచి స్నేహితుడైన బాలకృష్ణ ఆమె ద్వారా జరిగింది విని ప్రభుదేవాకు పోన్ చేసాడని చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో నాలుగు కాలాలు పాటు ఉండాలంటే పద్దతి మార్చుకోమని చెప్పినట్లు అంటున్నారు.

మొదటి నుంచీ బాలకృష్ణ ఆవేశపరుడనే పేరుంది. దాంతో ఆమెకు జరిగిన అన్యాయం విని తట్టుకోలేక ఇమ్మిడియట్ గా ప్రభుదేవాని హెచ్చరించాడని అంటున్నారు. అయితే ఇది రూమర్ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో కలుగచేసుకునే అలవాటు బాలకృష్ణకు లేదని, నయనతార వచ్చి అడిగితే కాదనలేక ప్రభుదేవాతో మాట్లాడి ఉండాలికానీ అంతకుమించి మరేమి ఉండదని చెప్తున్నారు.

ఇక గత నాలుగు రోజులుగా నయనతార, ప్రభుదేవా రిలేషన్ పై రకరకాల వార్తలు గుప్పు మంటున్న సంగతి తెలిసిందే. ఆమె చిన్నాన్న, పిన్ని మీడియా ముందుకు వచ్చి తమ కూతురు నయనతారని .. ప్రభుదేవా మోసం చేసాడని ఆరోపణ చేసారు. మరో ప్రక్క ప్రభుదేవా.. ఒక్కడే కాళహస్తి గుళ్లో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో నయనతార సినిమాల్లోకి మళ్లి వస్తున్న వాదన ఊపందుకుంది. అయితే దీనిపై నయనతార మీడియా ముందుకు రావటానికి ఆసక్తి చూపలేదు. అయితే ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి తన నిర్మాతలకు, అబిమానులకు ఊరట ఇచ్చింది. అది...‘‘నా చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే’’ అంటూ తమిళ మీడియాకు చెప్పింది. దాంతో ప్రభుదేవా సంగతేమో గానీ అంతా హ్యాపీ ఫీలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyans gabbar singh trailer launch details
I am scared of kissing on screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles