Indian film industry gets ready for strike1gif

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

TRS president K Chandrasekhar Rao.GIF

Posted: 02/15/2012 01:44 PM IST
Indian film industry gets ready for strike1gif

KCR

గత పదేళ్ళుగా తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తూ.... చల్లారుస్తూ తనదైన శైలిలో పోరాడుతున్న రాజకీయ నాయకుడు కేసీఆర్ రాజకీయ వాదే కాదు... మంచి మాట కారి, పాటకారి, గేయకారి. అన్ని కళలు కలబోసుకొని ఉన్న కేసీఆర్ ఇక తెలంగాణ రాదనుకున్నాడో లేక తెలంగాణ రావడం కోసం తన వంత ప్రయత్నంగా ఓ సినిమా తీయాలని అనుకున్నాడో కానీ త్వరలో ఇతను మెగా ఫోన్ పట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.కేసీఆర్ మంచి సాహిత్య కళాపోషకుడు. గతంలో ఈయన అనేక వ్యాసాలు కూడా రాశాడు. తాజాగా తెలంగాణకు అనుకూలంగా వచ్చిన చిత్రంలో పాట కూడా రాశాడు. సకల జనుల సమ్మె సందర్భంగా వచ్చిన జై బోలో తెలంగాణ, పోరు తెలంగాణ, ఆ తర్వాత ఇంకెన్నాళ్ళు లాంటి చిత్రాలు వచ్చాయి. జైబోలో తెలంగాణలో పాట రాశాడు. అయితే కేసీఆర్ మనస్సు ఇప్పుడు సినిమాల పై పడినట్లు సమాచారం.

ఇప్పటిదాక వచ్చిన తెలంగాణ అనుకూల చిత్రాలతో ఆయనకు సంతృప్తి కలగలేక పోవడంతో ఏకంగా తానే దర్శకుడుగా మారాలని నిర్ణయిం చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జీవన చిత్రంపై ఇటీవల కొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో ఏవీ ఆయనను పూర్తిగా సంతృప్తి కలిగించలేదట. ఈ చిత్రాలలో వేటికీ కేసీఆర్‌ పూర్తి మార్కులు వేయలే దంటు న్నారు. తెలంగాణ బతుకు, జీవన చిత్రాలు, వెతలు, కష్టాలు, కన్నీళ్ళు వంటి కథలను కొందరు నిర్మాతలు, దర్శకులు ముందుకు వచ్చి తెరపైకి ఎక్కించినప్పటికీ, అందుకు సంతోషంగానే ఉన్నప్పటికి, సాంకేతికత పరంగా ప్రజలను పూర్తిగా ఆకట్టుకోలేకపో యాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తానే స్వయంగా ఒక చిత్రాన్ని అన్నీ తానై తెరకెక్కించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కేసీఆర్‌ పలువురు సినీ రంగ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తాను మెగా ఫోన్‌ పట్టుకొని తీసే ఈ చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదల చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేవలం తెలంగాణ పేరుతో తీస్తే హిట్‌ కాదని,నవరసాలు ఉండేలా తాను ఈ చిత్రాన్ని నిర్మించి భారీస్థాయిలో విజయవంతం చేయాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ కేసీఆర్ మెగాఫోన్ పట్టుకొని సినిమా తీస్తే అది తెలంగాణ వారి పైనే కాకుండా తనకు శత్రువులైన వారి పై కూడా తీస్తారని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో 2014 వరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanakhan in mr nokia
Venkatesh new movie shadow in australia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles