Shekhar kapur to play kamal haasan movie in uncle roll

Kamal Hassan, Vishwaroopam, Shekhar Kapoor, Bhojpuri Actress, Ruby Singh, Commits Suicide, Mumbai, india tv news

The casting of Kamal Haasan's 'Vishwaroopam' just got even more intriguing. While earlier we had the 20-something Sonakshi Sinha being cast as the film's 57-year-old leading man Haasan's love interest, we now have Shekhar Kapur who is just 12 years older than him playing his uncle in the film

Shekhar Kapur to play Kamal Haasan movie.gif

Posted: 02/11/2012 03:48 PM IST
Shekhar kapur to play kamal haasan movie in uncle roll

Shekar-kapur

కమలహాసన్ డైరెక్ట్ చేస్తున్న స్పై థ్రిల్లర్ 'విశ్వరూపం'లో శేఖర్ కపూర్ నటిస్తున్నారు. 'మిస్టర్ ఇండియా', 'బాండిట్ క్వీన్', 'ఎలిజిబెత్' సినిమాల దర్శకునిగా శేఖర్ కపూర్ ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన నాయికగా సోనాక్షి సిన్హా (శతృఘ్న సిన్హా కూతురు) నటిస్తుండగా, కమల్ మావయ్యగా శేఖర్ కనిపించనున్నారు. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్ని ఇటీవలే ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో చిత్రీకరించారు.

20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత శేఖర్ నటిస్తున్న సినిమా ఇదే. ఆయన నటించిన చివరి సినిమా మహేశ్ భట్ డైరెక్ట్ చేసిన 'సాత్వాన్ ఆస్మాన్'. "కమలహాసన్ వల్లే మళ్లీ నేను కెమెరా ముందుకొచ్చాను. అద్భుతమైన మేధావి అయిన కమల్ కు ఎవరు నో చెబుతారు?" అని ఆయన ఎదురు ప్రశ్నించారు. గతంలో ఆ ఇద్దరూ ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. "డైరెక్టర్లుగా కానీ, నటులుగా కానీ మేమెప్పుడూ కలిసి పనిచేయలేదు. కానీ చాలా యేళ్లుగా మేమిద్దరం స్నేహితులం. సినిమా పట్ల శేఖర్ కున్న అవగాహన అమోఘం. గంటలకొద్దీ మేము సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ పాత్రని చేయమని ఆయన్ని అడిగిన వెంటనే ఏమీ ప్రశ్నించకుండా ఒప్పుకున్నారు" అని తెలిపారు కమల్.

తాజా కబురేమంటే తన రాజ్ కమల్ మూవీస్ బేనర్ పై నిర్మించే మరో సినిమాని డైరెక్ట్ చేయాల్సిందిగా శేఖర్ ని కమల్ కోరారు. అంతర్జాతీయ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందే ఆ సినిమాలో హీరోగా కమల్ నటిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Utv head siddharth denies marriage with vidya
Bhojpuri actress ruby singh commits suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles