Stat crickets

Stat Crickets

Stat Crickets

stars.gif

Posted: 01/14/2012 05:11 PM IST
Stat crickets

షార్జాఈ పేరు వినగానే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబుకుతుంది. క్రీడాపరంగా ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఈ క్రీడా ప్రాంగణం ఇప్పుడు భారతీయ సినీతారల తళుకులతో కళకళలాడుతోంది. గత ఏడాది ఇండియాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కి ఈ దఫా షార్జా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికైంది. వసూళ్లతో రికార్డులను సృష్టించడమేకాదు, అవసరమైతే సిక్స్‌లూ ఫోర్లతో పరుగుల వరద కూడా సృష్టించగలం అని నిరూపించడానికి పలువురు ఇండియన్ స్టార్ హీరోలు ఈ టోర్నీ కోసం సమాయత్తమవుతున్నారు. శుక్రవారం(నేడు) జరిగే తొలి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్, ముంబయ్ హీరోస్ తలపడనున్నారు.

సందర్భంగా మ్యాచ్‌కు ఒకరోజు ముందేతెలుగు వారియర్స్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. తెలుగు వారియర్స్ టీమ్ కెప్టెన్ విక్టరీ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరిగింది. శ్రీకాంత్, తరుణ్, అఖిల్ అక్కినేని, తారకరత్న, రాజీవ్ కనకాల, ఖయ్యూమ్, అయ్యప్ప పి.శర్మ, సామ్రాట్ తదితరులు ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. చార్మి, కాజల్, నిషా అగర్వాల్ తదితర అందాలభామలు ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hrithik roshan taking krish 2 easy
Business man telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles