Rana new film krishnam vande launched

rana new film krishnam vande launched, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

rana new film krishnam vande launched, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

rana-new-film1.gif

Posted: 12/14/2011 01:02 PM IST
Rana new film krishnam vande launched

rana-imgహైద్రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఈ రోజు దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా ఆ వేడుకతోపాటుగా ఒక కొత్త సినిమాను ప్రారంభించటం జరిగింది.  గమ్యం, వేదం లాంటి సున్నితమైన అంశాలతో చిత్రాలను తీసి, చిత్ర నిర్మాణంలో తనదైన విభిన్న శైలిని ప్రదర్శించిన దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ చిత్రం కృష్ణం వందే జగద్గురుం.  కోటా శ్రీనవాసరావు, పోసాని కృష్న మురళి, బ్రహ్మానందం తదితర కళాకారుల నట సహకారంతో రూపొందబోతున్న ఈ చిత్రంలోని ముఖ్య పాత్ర రానా కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుందని దర్శకుడు క్రిష్ అన్నారు.  నిజానికి ఈ చిత్ర కథను క్రిష్ చాలా సంవత్సరాల క్రితమే తయారు చేసి పెట్టుకున్నారు.  ఇప్పటికి ఆయన ఊహల్లోని ఆధునిక కృష్ణుడి పాత్రను తెరమీదకు తేవటానికి ఇప్పటికి సరైన కథానాయకుడు దొరికాడన్నమాట.  ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్న కీరవాణి కూడా ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గన్నారు. 

భారతభాగవతాల్లోని శ్రీకృష్ణుడి పాత్ర అత్యంత శక్తివంతమైనది, సందేశాత్మకమైనది, మార్గదర్శకమైనది.  అటువంటి పాత్రలోని విభిన్న కోణాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నవీన కృష్ణ రూపంలో క్రిష్, రానాను చూపించబోతున్నారు.  వేదం, గమ్యంలో స్పృశించి, ఆలోచింపజేసిన సున్నితమైన అంశాలకంటే ఎక్కువ సందేశాత్మకంగా, మనోరంజకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని ఆశించవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma is a bluff master
Rgv announces film on 2611 terror attack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles