Panjaa villain adivi sesh

panjaa villain adivi sesh, alanti, patre, cheyali, panja, villain, adavi, sheh, Tollywood, Entertainment, Telugu, Panja movie Telugu Cinema News Power star Pawan

panjaa villain adivi sesh

panjaa villain adivi sesh.GIF

Posted: 12/05/2011 06:40 PM IST
Panjaa villain adivi sesh

panjaa villain adivi sesh

కర్మ’తో హీరోగా, దర్శకుడిగా పరిచయమయ్యాను. ఆ సినిమా నాకు పరిశ్రమలో సులువైన ఎంట్రీనిచ్చింది. అందులోని కొన్ని సన్నివేశాలు సహా పాటల్లో నా నటప్రదర్శన నచ్చి దర్శకుడు నన్ను ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు ఎంచుకున్నారు. నిజానికి నాలాంటి కొత్తవారికి ఇంత పెద్ద అవకాశం రావడం..అరుదైన విషయం’’ అన్నారు అడివి శేష్‌;

ఆయన పవన్‌కళ్యాణ్‌-విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లోని ‘పంజా’లో ప్రతినాయకుడిగా నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ..పైవిధంగా స్పందించారు. మరిన్ని సంగతులు చెబుతూ ‘‘తొలి సినిమా తర్వాత వరుసగా 15 చిత్రాల్లో (అన్నీ ప్రేమకథలే) హీరోగా అవకాశమొచ్చింది. సినిమాలకైతే లోటు లేదు. కథే లోటు. అందుకే వదులుకున్నా. అయితే ‘చేస్తే ఇలాంటి పాత్రలోనే చేయాలి’ అన్నంత మంచి అవకాశం ‘పంజా’తో వచ్చింది. పవన్‌ హీరోగా నటించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఓ విలక్షణ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది. 

నా పాత్ర విషయానికొస్తే..నేనో క్రేజీ ఫెలోని. అవతలివారికి నా వల్ల ఎప్పుడూ ప్రమాదమే. సాఫ్ట్‌గా కనిపించి..నైసుగా కోసేస్తా.. విలక్షణ విలనీ చేస్తాను. పైకి కనిపించేట్టు కాకుండా దానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది’’ అన్నారు. దర్శకుడి గురించి మాట్లాడుతూ ‘విష్ణు..ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. నా పాత్రను తనే స్వయంగా నటించి మరీ చూపించారు. దాంతో నా పని చాలా సులువైంది. నేను జాకీ ష్రాప్‌తో ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాను. పవన్‌తో, అంజలి లావాణియాతో కీలక సన్నివేశాల్లో కనిపిస్తా. ఓ భారీ యాక్షన్‌ సీన్‌లోనూ నటించాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh body guard in final schedule
Paga sadista movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles