Its my love story heroine nikitha

Its My Love Story heroine Nikitha, Narayan Interview, Nikitha Narayan Interview, heroine Nikitha Narayan Interview, It's My Love Story Nikitha

Its My Love Story heroine Nikitha

it is my lovestory.GIF

Posted: 11/30/2011 08:37 PM IST
Its my love story heroine nikitha

Nikitha

తెలిసినవారందరూ నన్ను నిఖిత అని పిలవడం మానేసి ‘వందన’ అని పిలుస్తున్నారు. తొలి సినిమాతోనే ఇంత గుర్తింపు రావడం ఆనందంగా ఉంది’’ అంటున్నారు ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ ద్వారా నాయికగా పరిచయమైన నిఖిత నారాయణ. ఈ సినిమా సక్సెస్‌కు సంబంధించిన క్రెడిట్ మొత్తం దర్శకుడు మధుర శ్రీధర్‌కే దక్కుతుందని నిఖిత అన్నారు.

ఇంకా మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా అంగీకరించే ముందు నేను పడిన మానసిక సంఘర్షణ అంతాఇంతా కాదు. నెలకు లక్ష రూపాయలు జీతం ఇచ్చే ‘ఫేస్‌బుక్’ సంస్థలో ఉద్యోగం ఓ పక్క. లక్షల మందికి చేరువయ్యే ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ సినిమా అవకాశం మరో పక్క. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీక సతమతమైపోయాను. పదేళ్ల వయసులో ‘అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్’ వ్యాపార ప్రకటనలో నటించాను. అప్పట్నుంచే యాక్టింగ్ అంటే క్రేజ్. అందుకే నా అడుగులు సినిమా వైపే పడ్డాయి.

‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ కోసం ఏర్పాటు చేసిన స్టార్ హంట్‌లో వందలమంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారందరిలో నేను ఎన్నికవ్వడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. డేర్‌గా నిర్ణయమైతే తీసుకున్నాను కానీ... లోలోన టెన్షన్. సినిమా హిట్ అవుతుందో, లేదో? మంచి ఉద్యోగాన్ని వదులుకున్నానేమో?... ఇదే ప్రశ్నలు తెరలు తెరలుగా మదిలో. ఇప్పుడు రిలీజ్ అయ్యాక, నా పాత్రకు వస్తున్న స్పందన చూసి ఆ బాధలన్నింటినీ మరచిపోయాను’’ అన్నారు నిఖిత. ‘‘2009లో ‘డాబర్ మిస్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్’గా ఎన్నికయ్యాను. 2010లో ‘మిస్ సౌతిండియా’ రన్నరప్‌గా నిలిచాను. ఇప్పుడు ఒక హిట్ సినిమాతో కథానాయికగా నా కెరీర్ మొదలైనందుకు గర్వంగా ఉంది’’ అని చెప్పారు నిఖిత

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine pavani reddy
Pavan kalyan stills in panja  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles