Bejawada cleared for release

Bejawada Cleared for Release, bezawada movie review, bezawada movie, bezawada movie trailer, bezawada movie release date, bezawada release date, bezawada movie review, naga chaitanya bezawada movie review, bezawada movie trailer, bezawada movie audio, bezawada rowdilu, bezawada rowdilu trailer, bezawada rowdilu release date, bezawada rowdilu movie review, bezawada rowdilu cinema review, bezawada rowdilu, naga chaitanya bezawada rowdilu movie review,

Bejawada Cleared for Release

bezawada.GIF

Posted: 11/30/2011 08:28 PM IST
Bejawada cleared for release

Bejawada Cleared for Release

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా వివేక్ కృష్ణ ద‌ర్శక‌త్వంలో రాంగోప‌ల్ వ‌ర్మ నిర్మించిన చిత్రం బెజ‌వాడ. ఈ చిత్రం రేపు డిసెంబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. క‌థా ప‌రంగా నాగ‌చైత‌న్యని పూర్తి మాస్ క్యారెక్టర్‌లో చూపించ‌డానికి ద‌ర్శకుడు చాల క‌ష్టప‌డ్డాడు. ఈ సినిమా స్టిల్స్‌, ట్రయ‌ల్స్ చూస్తుంటే కూడా నాగ‌చైత‌న్య ప‌క్కా మాస్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడ‌ని తెలుస్తుంది.

గ‌తంలో నాగార్జున హీరోగా రాంగోపాల్‌వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన శివ చిత్రానికి ఈ చిత్రానికి పోలిక అస‌లే లేద‌ని రాము చెబుతున్నా ప్రేక్షకులు మాత్రం శివ చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చుకుంటూనే ఉన్నారు. రాంగోపాల్‌వ‌ర్మ చిత్రం అంటేనే వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.. ఈ చిత్రం కూడో ఎన్నో వివాదాల న‌డుమ విడుద‌ల‌కు సిద్దమ‌యింది.

ముఖ్యంగా  ఈ సినిమా బెజ‌వాడ వాసుల‌ని ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని వర్మ ఇప్పటికే ప్రక‌టించినా ఈ సినిమా దేవినేని సోదరుల చరిత్రేనని విజయవాడలో బ్యానర్లు ప్రత్యక్షమవడం కలకలం రేపుతుంది. దేవినేని సోదరుల చరిత్ర విషయంపై  నగరంలో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఏది ఏమ‌యినా బెజ‌వాడ చిత్రం ఎలా ఉంది.. నిజంగా వ‌ర్మ చెబుతున్నట్టుగానే కేవ‌లం క‌ల్పిత క‌థ‌తో తెర‌కెక్కిందా.. లేక నిజ జీవిత పాత్రల‌తోనే సినిమా తీసారా.. సినిమా ఎలా ఉండ‌బోతోంది.. ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే.. డిసెంబ‌రు 1, గురువారం మ‌ధ్యాహ్నం క‌ల్లా ఎక్స్‌క్లూజివ్‌ బెజ‌వాడ మూవీ రివ్యూ మీకు అందుబాటులోకి వ‌స్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lux baby asha saini
Heroine pavani reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles