The Best Home Remedies To Get Rid From Old Age Shades And To Get Glow Skin | Beauty Tips | Skin Remedies

Remedies to get rid from old age shades glow skin beauty tips

skin remedies, skin home tips, skincare tips, skincare remedies, skin beauty tips, skin healthy tips, skin healthy remedies, old age shadows remove tips, old age shadow skin, old age shadow best remedies, home remedies for skin

Remedies To Get Rid From Old Age Shades Glow Skin Beauty Tips : The Best Home Remedies To Get Rid From Old Age Shades And To Get Glow Skin.

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టే చిట్కాలు

Posted: 10/14/2015 06:43 PM IST
Remedies to get rid from old age shades glow skin beauty tips

మారుతున్న జీవన విధానం, కాలుష్య వాతావరణం కారణంగా సౌందర్యపరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. యుక్త వయస్సుల్లో ముఖంపై ముడతలు రావడం, వృద్ధాప్య ఛాయలు ఏర్పడటం, చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం.. లాంటి సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొంది, మెరుగైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే.. బ్యూటీ ప్రోడక్టులు వాడటంకన్నా సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. ప్రకృతి సహజంగా లభించే కొన్ని ఫ్రూట్స్, ఇతర పదార్థాల ద్వారా రెమెడీలు చేసుకుని ముఖానికి పట్టిస్తే.. వృద్ధాప్య ఛాయలు పూర్తిగా తొలగిపోయి ముఖవర్ఛస్సు మరింత పెరుగుతుంది. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోవాల్సిందిగా బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. వీటిల్లో ‘ఫైబర్’ బౌల్ మూమెంట్‌ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. యంగ్‌గా ఉంచుతుంది. ఇక టమోటా జ్యూస్ కూడా చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ను వేరు చేసే మూలకం ‘పొటాషియం’ అధికంగా ఉంటుంది. దీంతోపాటు ఈ జ్యూస్ లో లైకోపిన్ అనే ‘లక్షణాలు’ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి కాంతినిస్తుంది.

* రెండు క్యారెట్లను ఉడికించి గుజ్జుచేసి అందులో తేనె కలపుకోండి. దీన్ని ముఖానికి దట్టించండి. ముఖం కింది నుంచి పైకి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగేసినట్టయితే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. రెండు క్యారెట్లు తీసుకొని మెత్తగా పేస్టులా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ఓ చిన్న గిన్నెలో వేసుకోండి. ఇందులో ఆయిదారు చెంచాల చిక్కటి పచ్చిపాలు కలుపుకోండి. దీనికి ముందు మీ ముఖాన్ని క్లెన్సింగ్‌ మిల్క్‌తో శుభ్రం చేసుకోండి. ఆపై ఆల్మండ్‌ క్రీముతో మర్దన చేయాలి. ఇలా మర్దన చేసేటపుడు సిద్ధంగా ఉన్న క్యారట్‌ ముద్ద, పాలు ఉపయోగించాలి. ముఖానికి ఆ పేస్ట్ వాడిన 15 నిమిషాల తర్యాత ముఖం శుభ్రం చేసి ఆవిరిపట్టండి. బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ తీసెయ్యాలి.

* ఒక పాత్రలో కొంచెం క్యారెట్‌ గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ లాగా వేసుకోవాలి. పావుగంట అయిన తరువాత ప్యాక్‌ తీసేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా చర్మం నునుపుగా కాంతివంతంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old age skin remedies  skincare tips  beauty tips for skin  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more