The Best Home Remedies to avoid pimples on head | beauty tips | healthy foods | healthy shampoos

Home remedies to avoid pimples on head beauty tips healthy foods

home remedies, pimples avoid tips, pimples on head, pimples on head tips, head pimples avoid tips, head pimples home remedies, hair home remedies, head remedies, hair beauty tips, head pimples beauty tips

Home Remedies to avoid pimples on head beauty tips healthy foods : Experts giving some best home remedies to avoid pimples on head permanently.

తలలో మొటిమలను నివారించే చిట్కాలు

Posted: 07/14/2015 10:45 AM IST
Home remedies to avoid pimples on head beauty tips healthy foods

వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతిఒక్కరి తలలో మొటిమలు వస్తాయి. అవి ఎంతో అసౌకర్యంగా అనిపిస్తాయి. సరిగ్గా తల దువ్వుకోవడానికి కూడా వీలుకాదు. ఈ మొటిమల కారణంగా జుట్టు సంరక్షణ కూడా దెబ్బతింటుంది. జుట్టు పొడిబారిపోవడం, తర్వాత రాలడం.. ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మొటిమలు రావడానికి అసలు కారణం ఏమిటంటే.. తలమీది చర్మంలో వుండే రంధ్రాలను ఆయిల్ గ్లాండ్స్ (నూనెగ్రంతులు) అని అంటారు. వీటి ద్వారా విడులయ్యే సెబమ్ వల్ల చర్మానికి రక్షణగా వుంటుంది. కానీ.. నేచురల్ ఆయిల్స్ లేకుంటే చర్మం డ్రై అవుతుంది. చర్మం మురికి, డెడ్ స్కిన్ సెల్స్ తో బ్లాక్ అయినప్పుడు బ్యాక్టీరియా చేరి చర్మంను ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ కు కూడా గురిచేస్తుంది. తర్వాత తలలో దురత, వాపులు రావడం.. ఇంకా ఇతరత్ర సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. ఈ మొటిమల నుంచి విముక్తి పొందవచ్చు.

తలలో మొటిమల నివారణకు ఇంటి చిట్కాలు :

* ఒక మగ్గులో నీళ్లు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి. తలస్నానం చేసుకున్న తర్వాత ఆ వెనిగర్ మిశ్రమాన్ని తలారా పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలోని హానికారక బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అలాగే.. తలలోని మొటిమలను పూర్తిగా నివారించడంలో ఈ రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

* నేటి యంగ్ జనరేషన్ లో ఫ్యాషన్ పేరుతో పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. అయితే.. వాటికి దూరంగా వుండే శ్రేయస్కరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. వాటిలో వుండే కెమికల్స్ తలలోని మొటిమలను మరింత ప్రేరేపించి, ఇంకా ఎక్కువ పెరిగేలా చేస్తాయి. కాబట్టి.. సువాసనలు, కఠినమైన కెమికల్స్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

* కొన్ని సందర్భాల్లో చుండ్రు కూడా మొటిమలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగా చుండ్రును పూర్తిగా నివారించుకోవాలి. చుండ్రును నివారించే షాంపును రెగ్యులర్ స్నానంలో ఉపయోగించుకుంటే.. డ్యాండ్రఫ్ పూర్తిగా తొలగిపోవడంతోపాటు మొటిమలు కూడా నివారించబడుతాయి. అయితే.. మేలైన షాంపూలు వాడాలి.

* హెల్తీ, నేచురల్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటే.. అందులో వుండే పోషకాలు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహపడుతాయి. అంతేకాదు.. తలలో వుండే మొటిమలను నివారించడానికి కూడా సహాయపడుతాయి. కాబట్టి.. రెగ్యులర్ డైట్ లో హెల్దీ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు జుట్టుకు ఎంతో శ్రేయస్కరం.

* కొందరికి తలకు హ్యాట్స్, క్యాప్స్ ను తగిలించుకోవడం అలవాటు వుంటుంది. ఆ అలవాటును వెంటనే నివారిస్తే మంచిది. తలకు బాగా గాలి సోకే విధంగా ఉంచుకోవాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల తలలో దురద కలిగినప్పుడు గోకకుండా ఉండాలి. దాంతో బ్రేక్ అవుట్స్ కలగకుండా ఉంటాయి.ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

* తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే.. తరచూ తలస్నానం చేస్తుండాలి. ఇలా స్నానం చేయడం వల్ల తలలో వుండే బ్యాడ్ బ్యాక్టీరియా నివారించబడి.. మొటిమలు దూరమవుతాయి. కానీ.. తలను మరీ డ్రైగా మార్చుకోకూడదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : home remedies  head pimples tips  hair beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more