Simple tips to maintain beauty skin without any cost

beauty tips, healthy beauty tips, simple beauty tips, simple tips to maintain beauty, facial packs, face beauty tips, beauty tips for face, tips for beauty face, healthy food for beauty, food for beauty skin, beauty tips for skin, beauty tips for face

simple tips to maintain beauty skin without any cost which will increase the glow and beauty of skin

అందంగా కనిపించడానికి సాధారణ చిట్కాలు!

Posted: 10/16/2014 05:05 PM IST
Simple tips to maintain beauty skin without any cost

ప్రస్తుతకాలంలో పిల్లలనుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరూ అందంగా వుండాలని కోరుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. అలాగే వయసు పైబడిన మహిళలు కూడా తమ సౌందర్యాన్ని చాలా అందంగా మెయింటెన్ చేయాలని భావిస్తుంటారు. అలాంటప్పుడు అందంగా కనిపించడంకోసం అందరూ రకరకాల క్రీములను వాడటం, ఎక్కవ ఖర్చుతో కూడుతున్న ఫేషియల్స్ ప్యాక్స్ చేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇటువంటి పద్ధతులతో అందాన్ని సొంతం చేసుకోవచ్చు కానీ... అందులో వుండే రసాయనాలు కొంతవరకు చర్మాన్ని హాని కలిగించవ్చు. ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే.. ఫేషియల్ ప్యాక్స్, క్రీములను నిత్యం వాడాల్సి వుంటుంది. దీంతో ఎక్కువ ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా సాధారణ పద్ధతుల ద్వారా అందాన్ని సొంతం చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు చేయకుండానే ఆకర్షణీయమైన అందాన్ని తక్కువ సమయంలోనే పొందవచ్చు. మరి ఆ పద్ధతులేమిటో తెలుసుకుందాం..

1. ప్రతిరోజూ చాలా ఎక్కువ మోతాదులో నీటిని తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. మానవ శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తూ వుంటుంది. ఇది శరీరంలో జీవక్రియలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. దీని ప్రభావం చర్మం మీద కూడా చూపుతుంది. అటువంటి సమయాల్లో నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. తద్వారా చర్మ సౌందర్యాన్ని కూడా రక్షించినట్లు అవుతుంది.

2. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వున్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే.. ఇవి శరీరంలో వివిధ వ్యాధులను ఎదుర్కోవడానికి, వయస్సు పైబడకుండా వుండటానికి, స్కిన్ సమస్యలను ఎదుర్కోవడానికి, ఇన్ల్ఫమేషన్ ను తగ్గించడానికి కీలకపాత్రను పోషిస్తాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో వాడితే చాలా మంచిది.

3. చర్మసౌందర్యానికి కావలసిన కొన్ని హోమ్ రెమెడీస్ ను ఇంట్లోనే తయారుచేసుకుంటే మంచిది. ఎందుకంటే.. అందులో సహజంగా చర్మసౌందర్యానికి కావలసిన ఔషధగుణాలు పుష్కలంగా వుంటాయి. అలాకాకుండా క్రీములను వాడితే.. అందులో వుండే రసాయనాలు చర్మాన్ని హాని కలిగిస్తాయి. చర్మం పొడిబారిపోయేలా చేస్తాయి.

4. విటమిన్ సీ ఎక్కువ మోతాదులో వుండే ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే.. ఇది సూర్యరశ్మి వల్ల ముడతలు పడిన చర్మాన్ని తిరిగి సౌందర్యంగా మార్చడంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. చర్మానికి కావలసిన ఎక్కువ కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. చర్మంపై వుండే మొటిమలు కూడా మాయమవుతాయి.

5. అవొకాడో, ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ఫిష్ వంటి హెల్తీ ఫ్యాట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మన చర్మానికి చాలా అవసరం అవుతుంది. వీటి వల్ల చర్మం ఎల్లప్పుడు యవ్వనంగా ఉంటుంది. ముడతలుపడిన చర్మాన్ని తిరిగి అందంగా మలచడంతోపాటు కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.

6. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యాన్ని కూడా పొందవచ్చు. జీవితంలో అనుభవిస్తున్న ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికే ఈ పద్ధతులను అనుసరిస్తారు. ఎక్కువ స్థాయి ఒత్తిడిలో వున్నప్పుడు చర్మసౌందర్యం దెబ్బతినే అవకాశాలు వుంటాయి. అలాంటప్పుడు యోగా చేస్తే.. మానసిక ఒత్తిళ్లు దూరం అవడంతో మనస్సు హాయిగా అగుపిస్తుంది. ఫలితంగా చర్మం కూడా అందంగా మారుతుంది.

7. ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలామంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఎన్ని అవసరమైన పనులు వున్నా.. రోజూ సరిపడేంత సమయం నిద్రపోవడం చాలా అవసరం. అది స్కిన్ డ్యామేజ్ ను నివారించడంతోపాటు కాంతివంతగా మార్చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  health tips  facial packs  tips to maintain beauty  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more