The healthy foods to prevent white hair in early age

beauty tips, health tips, healthy foods, healthy foods white hair, healthy food to prevent white hair, beauty tips for hair, hair beauty tips, healthy beauty tips

the healthy foods to prevent white hair in early age

తెల్లజుట్టును నివారించే ఆహారపదార్థాలు

Posted: 09/24/2014 05:39 PM IST
The healthy foods to prevent white hair in early age

(Image source from: the healthy foods to prevent white hair in early age)

వయసు పెరుగుతున్నకొద్దీ జుట్టు కూడా తెల్లబడటం సర్వసాధారణం. కానీ నేటి ఫాస్ట్ జనరేషన్ లో అయితే 20 సంవత్సరాల వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులలో మార్పు కారణంతోపాటు సమయానుకూలంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడంతోనే తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంటుంది. అలాగే జుట్టుకు కావాల్సిన న్యూట్రీషియన్స్, పోషక పదార్థాలు అందకపోవడంతోనే ఇలా జరుగుతుంది. మరి ఈ తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడాలంటే... కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.

1. ఆకుకూరలు : ఇవి పిగ్మెంట్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి. ఈ పిగ్మెంట్ జుట్టు రంగు మారకుండా స్థిరంగా వుంచడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను తీసుకుంటే చాలు.. తెల్లజుట్టును అదుపు చేయొచ్చు.

2. బీన్స్ : ఇందులో అనుకున్నదానికంటే అధిక మోతాదులో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషక పదార్థాలను అందించి.. రంగును మార్చకుండా చేస్తాయి.

3. గుడ్లు : జుట్టుకు అత్యంత అవసరమైన విటమిన్ బి12 గుడ్డులో పుష్కలంగా వుంటుంది. ఈ విటమిన్ రక్తప్రసరణను మెరుగుపరిచి, ప్రీరాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తుంది. దాంతో జుట్టురంగు తెల్లగా మారదు.

4. కరివేపాకు : కరివేపాలకు ఎంత ఎక్కువగా తింటే.. జుట్టుకూడా అంతే నల్లగా వుంటుంది. ఇందులో జుట్టుకు కావాల్సిన పోషక పదార్థాలు అన్ని పుష్కలంగా వుంటాయి. అంతెందుకు.. దక్షిణ భారతంలో వుండే మహిళల తమ ఆహారపదార్థాల్లో నిత్యం ఈ ఆకును తీసుకుంటారు కాబట్టి.. వాళ్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటుంది.

5. క్యారెట్ : క్యారెట్ లో జుట్టుకు కావాల్సిన విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది జుట్టును ఊడిపోకుండా కాపాడటంతోపాటు.. నల్లగా వుంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

6. బెర్రీస్ : వీటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది తలలో రక్తప్రసరణ జరిగేందుకు సహాయపడుతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడకుండా నల్లగా వుంటుంది.

7. మీట్ లివర్ : శరీరంలో ఐరన్ లెవెల్స్ తగ్గిపోతే జుట్టు కూడా తెల్లగా మారుతుంది. ఆ సమయంలో రెగ్యులైర్ డైట్ లో మాంసాహారాల్లో లివర్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఐరన్ లెవెల్స్ ఆరోగ్యంగా వుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  healthy tips  hair beauty tips  healthy foods for hair  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more