సాధారణంగా అమ్మాయిలు, మహిళలు తమ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఎన్నోరకాల పద్ధతులతోపాటు రకరకాల స్పాలకు, బ్యూటీ సెంటర్స్ కు వెళుతుంటారు. అందులో కొంతమందికి మంచి ప్రయోజనాలు లభిస్తే... మరికొంతంమందికి బ్యూటీ సెంటర్లలో ఉపయోగించే క్రీములు, ఇతర లోషన్లు ఒంటికి పట్టక బెడిసి కొడతాయి. దాంతో వారు అందాన్ని పొందడమే కాదుకదా.. వున్న అందాన్ని కూడా పోగొట్టుకుంటారు. పైగా అవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
అమ్మాయిలు అందాన్ని పొందడం కంటే ముందు అందులో వున్న లోపాలను గుర్తించుకోవడం ముఖ్యం. అలాగే వాటికి సంబంధించిన క్రీములు, చిట్కాలు, రెమెడీస్ ఏంటో క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. అప్పుడే వారు ప్రకాశవంతమైన అందాన్ని పొందగలుగుతారు. అందానికి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలకు అవసరమయ్యే కొన్ని ఫేస్ ప్యాక్ చిట్కాలను మీకోసం అందిస్తున్నాం... వాటిని ఒక్కసారి అనుసరించి చూడండి.. మీలో మార్పును గమనించగలుగుతారు.
ప్రకాశవంతమైన అందాన్ని, చర్మాన్ని పొందడం కోసం అవసరమయ్యే కొన్ని ఫేస్ ప్యాక్స్ :
1. డ్రై స్కిన్ : ప్రస్తుతకాలంలో చాలా మంది యువతులు, మహిళలు ఈ డ్రై స్కిన్ సమస్య నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలంలో వేడితాపం ఎక్కువగా వుండటం వల్ల చర్మం పొడిగా మారడం జరుగుతుంది. అలాగే వాతావరణ కాలుష్యాల వల్ల చర్మరంధ్రాల్లో మురికి ఎక్కువగా చేరిపోతుంది. దీంతో వారి చర్మం పొడిగా మారిపోయి వయస్సైపోయిన ముసలివారిలాగా కనిపిస్తారు. ఇలా పొడిగా మారిన చర్మం మీద ముడతలు, మచ్చలు ఏర్పడటం మొదలవుతాయి. తరువాత చర్మం నిర్జీవంగా మారిపోవడం జరుగుతుం. ఇటువంటి చర్మం నుంచి విముక్తి పొంది ప్రకాశవంతమైన చర్మాన్ని పొందాలంటే... కొన్ని ఫేస్ ప్యాక్స్ ను మీరే తయారుచేసుకోవచ్చు. అవి ఏమిటంటే..
* అరటి ఫేస్ ప్యాక్ :
విధానం : మొహాన్ని ముందుగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత అరటిపళ్లను తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనెను మిక్స్ చేసుకొని ముఖానికి పట్టించుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, నీటిగా తుడుచుకోవాలి.
ఫలితాలు : అరటిపండులో ఎక్కువగా పొటాషియం వుంటుంది. ఇది పొడిగా, నిర్జీవంగా మారిపోయిన చర్మానికి చల్లదనాన్ని అందించి.. నునుపుగా, మృదువుగా మారడానికి సహాయపడుతుంది. అలాగే ముఖంపై వున్న మొటిమలను, మచ్చలను కూడా దూరం చేయడంలో తనదైన పాత్రను పోషిస్తుంది.
* అవొకాడో ఫేస్ ప్యాక్ :
విధానం : తీసుకున్న అవొకాడోను బాగా దంచుకుని మెత్తగా ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి. అందులో కొంచెం తేనె, పెరుగును పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ ను వేసుకున్న ఫర్వాలేదు. ఈ విధంగాతయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని, బాగా ఎండిపోయేంతవరకు వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఫలితాలు : అవొకాడోలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైటో న్యూట్రియంట్స్, యాంటీ యాక్సిడెంట్స్ వంటి పోషకాలు ఎక్కువగా వుండటం వల్ల.. పొడిగా వున్న చర్మాన్ని, డ్రై హెయిర్ ను నిత్యం మాయిశ్చరైజింగ్ గా (తేమగా) వుంచుతుంది. దీంతో చర్మం మృదువుగా, సాఫ్ట్ గా తయారయి.. ప్రకాశవంతమైన అందాన్ని అందిస్తుంది.
* ఓట్ మీల్ ఫేషియల్ :
విధానం : ఒక కప్పులో కొద్దిగా పాలను తీసుకుని, అందులో రెండు చెంచాలా ఓట్ మీల్ ను వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వరకు బాగా వేడిచేసుకోవాలి. అందులోనే కొద్ది ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంగా కొద్దిగా వేడిగా వుండగానే ముఖానికి పెట్టుకోవాలి. బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీరుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఫలితాలు : ఓట్ మీట్ లో అధికంగా అమినో యాసిడ్స్ కలిగి వుంటాయి. ఇవి చర్మం మీద వుంటే దద్దర్లను, మచ్చలను తొలగించి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. ఇటువంటి ఫేస్ ప్యాక్ ఎక్కువగా హైపో అలర్జిక్, సెన్సిటివ్ స్కిన్ కలిగినవారే ఉపయోగిస్తారు.
* బొప్పాయి (పపాయ) ఫేస్ ప్యాక్ :
విధానం : పపాయ చుట్టు వుండే పొట్టును, అందులో వుండే విత్తనాలను ముందుగా తొలగించుకోవాలి. తరువాత దానిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం తేనెను పోసి, ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పెట్టుకుని 30 నిముషాలవరకు అలాగే వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఫలితాలు : పపాయలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్, డెడ్ స్కిన్ సెల్స్ తో పోరాడి.. నిర్జీవంగా వున్న చర్మాన్ని తిరిగి జీవం పోస్తాయి. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
* నిమ్మకాయ రసం, సీసాల్ట్ మాస్క్ :
విధానం : నిమ్మకాయలను బాగా పిండుకుని నిమ్మరసాన్ని ఒక కప్పులో తీసిపెట్టుకోవాలి. అందులో కొద్దిగా సీసాల్ట్ ను వేసి ఓ మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై, మెడపై అప్లై చేసుకుని కొద్దిసేపు వరకు వుంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఫలితాలు : ఇందులో నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తే.. సీసాల్ట్ చర్మంలో వుండే డెడ్ స్కిన్ స్కెల్ ను నివారించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ రెండు కలవడం వల్ల యాంటీసెప్టిక్ లక్షణాలు ఏర్పడి.. మొటిమలను, మచ్చలను నివారించి.. అందుకు కారకమయ్యే బ్యాక్టీరియాలను అంతం చేస్తాయి.
2. ఆయిల్ స్కిన్ : ఇది మహిళలలో నిత్యం వుండే ఒక సమస్య. చర్మంలో వుండే సెబాసియస్ గ్రంథుల వల్ల ఆయిల్ స్కిన్ ఏర్పడుతుంది. దీంతో చర్మం మీద, చర్మరంధ్రాల్లో మురికి చేరడానికి ఎంతో ఆస్కారంగా వుంటుంది. దాంతో చర్మం మీద మచ్చలు, చారలు ఏర్పడడంతోపాటు చర్మం నల్లగా మారి తమ అందాన్ని కోల్పోతారు. ఇటువంటి సమస్య నుంచి బయటపడేందుకు అవసరమయ్యే కొన్ని ఫేస్ ప్యాక్స్...
* ఆస్పిరిన్ మాస్క్ :
విధానం : ఆస్పిరిన్ పిల్స్ (మాత్రలు)ను తీసుకుని మెత్తగా, పొడిగా దంచుకోవాలి. అందులో కొద్దిగా నీరు పోసి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. అందులో పెరుగును మిక్స్ చేసుకున్న ఎటువంటి ఇబ్బందులు వుండవు. ఈ విధంగా తయారుచేసుకున్న ఈ పేస్ట్ ను.. కళ్లను తగలకుండా మొత్తం ముకానికి పట్టించుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఫలితాలు : ఆస్పిరన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరి (వ్యతిరేక శోథ) లక్షణాలు ఫుష్కలంగా వుంటాయి. ఇవి చర్మంలో వుండే వేడితాపాన్ని తగ్గించి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దీంతో మీరు ఆయిల్ స్కిన్ నుంచి ఉపశమనం పొంది, మృదువుగా, ప్రకాశవంతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
* ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ :
విధానం : ముందుగా చర్మాన్ని గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకుని, నీటుగా తుడుచుకోవాలి. తరువాత ఒక బౌలులో ఎగ్ వైట్ ను తీసుకుని అందులో కొంత నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోని 30 నిముషాలవరకు అలాగే వుండాలి. కొద్దిసేపు తరువాత ఒక పొరలాంటి ఫేస్ మాస్క్ మీ ముఖం మీద ఏర్పడుతుంది. దానిని తొలగించిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఫలితాలు : ఎగ్ వైట్ లో ప్రొటీనులు, అస్ట్రిజెంట్స్ వంటి లక్షణాలు పుష్కలంగా వుంాయి. ఇవి ముఖంపై వుండే మచ్చలను, మొటిమలను తొలగించడంతోపాటు చర్మ రంధ్రాలను మూసుకునేలా చేస్తాయి. అలాగే పొడిగా వున్న చర్మాన్ని తేమగా, మృదువుగా వుండేలా చేస్తుంది.
ఇలా ఈ విధంగా రకరకాల ఫేస్ ప్యాక్ లను మీరు సొంతంగా ఇంట్లోనే తయారుచేసుకుని... నిగనిగలాడే ప్రకాశవంతమైన చర్మాన్ని, అందాన్ని ఎటువంటి ఖర్చులు లేకుండా పొందువచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more