మొటిమలు పోగొట్టేందుకు...
- టమోటా గుజ్జు ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడగాలి.
- మూడు టీ స్పూన్ల తేనెలో దాల్చినచెక్క పొడి కొద్దిగా కలిపి రాత్రి పడుకోబోయేముందు మొటిమలపై రాయాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే ఫలితం ఉంటుంది.
- నిమ్మరసం, వేరుశెనగ నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి. నిమ్మరసంలో గంధంపొడి లేదా దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పూసినా ఫలితం ఉంటుంది.
- నిమ్మరసం, రోజ్ వాటర్‌లను సమపాళ్లలో కలిపి మొటిమలపై పూసి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
మెరిసే పెదవులకోసం...
- పొడి బారిన పెదవులపై కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి.
- కొంచెం పెరుగు తీసుకుని అందులో ఓ రెండు కుంకుమపువ్వు రెబ్బలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు రాసుకుంటే పెదవులకి మంచి రంగు వస్తుంది.
- నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.
- టాల్కమ్ పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు నిలుస్తుంది.
- వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.
- గులాబీరేకుల రసాన్ని రోజూ రాత్రిపూట పెదవులకి రాసుకుంటే నలుపురంగు విరుగుతుంది.
- ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీగడ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి.
- బీట్‌రూట్ రసాన్ని రోజు విడిచి రోజు రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more