వంటిల్లో పనిచేసే మహిళలు కొన్ని మెళకువలు పాటించితే ఇంట్లో ఉన్న కొన్ని సరుకులు పాడవకుండా ఉంటాయి. అలాగే కొన్ని చిట్కాలు పాటించితే ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- బియ్యాన్ని శుభ్రంచేసి కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పురుగు పట్టవు.
- గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ను తరుచూ నిమ్మరసంలో నానబెట్టి శుభ్రపరచాలి. అప్పుడే దానిపై చేరుకొని ఉన్న హానికారక క్రిముల దూరమవుతాయి.
- వంటసోడాలో నీళ్లు కలిపి మిశ్రమంలా తయారు చేసి వెండి వస్తువులను రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
- కొవ్వొత్తులని ఫ్రిజ్‌లో ఉంచి.. వెలిగిస్తే ఎక్కువ సేపు వెలుగుతాయి.
- ప్రమిదలని నీటిలో నానబెడితే నూనెని ఎక్కువగా పీల్చుకోవు.
- అగరొత్తుల బూడిదతో వెండి వస్తువులను తోమితే కొత్త వాటిలా మెరుస్తాయి.
- బాణలిలో పదార్థాలు అంటుకుపోతే నీళ్లు పోసి అందులో చారెడు ఉప్పు వేసి మరిగించాలి. కొద్దిసేపటికి నీళ్లు పోసేసి కాగితంతో రుద్దితే పాన్ శుభ్రపడుతుంది.
- క్రీమ్ చీజ్ ఇంట్లో అందుబాటులో లేనప్పుడు పనీర్‌ను చేత్తో మెత్తగా చేసి చిక్కటి పెరుగులో వేసి వాడుకుంటే సరిపోతుంది.
- గదిని శుభ్రం చేసే నీటిలో అరకప్పు గులాబీనీటిని కూడా జోడిస్తే గదంతా పరిమళభరితంగా ఉంటుంది.
- పొట్టు తీసిన వెల్లుల్లిరేకలను కప్పు వంటనూనెలో వేసుకొని ఉంచితే ఆ నూనె చక్కటి వాసన వస్తుంది.
- కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొడితే తర్వాత శుభ్రపరచడం తేలిక అవుతుంది.
- ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.
- గోధుమ, శెనగపిండిలలో తేమ చేరకుండా ఉంటాలంటే బిరింజి ఆకు వేయాలి.
- ఫ్రిజ్‌లో కూరగాయల అర అడుగున కాగితం పరిచి వాటిని ఉంచితే తడిని ఎప్పటికప్పుడు పీల్చుకుంటుంది. కూరలు చెడిపోవు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more