సోరియాసిస్ ఆలస్యం చేస్తే అనర్థమే
కారణాలు ఏమైనా సొరియాసిస్ బాధితుల్లో చాలా మంది వ్యాధి బాగా ముదిరిన తరువాతే వైద్య చికత్సల కోసం వెళుతున్నారు. సొరియాసిస్ వ్యాధికి చికిత్స ఆలస్యమైనకొద్దీ శరీరంలోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. ఒక్కో భాగంలోనికి వెళ్ళినపుడు ఒక్కో లక్షణం కనిపిస్తుంది. ఈ లక్షణాల ఆధారంగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలను బట్టి వ్యాధి మూలాల్లోకి వెళ్లే ఆయుర్వేద చికిత్స చేయడం వల్ల సొరియాసిస్‌ను పూర్తిగా తొలగించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్ పూజారి రవికుమార్.
సొరియాసిస్ చర్మంపై ఉండే వ్యాధిగా కనిపిస్తుంది. కానీ చికిత్స ఆలస్యం చేస్తే శరీరంలోని పలు భాగాల్లోకి విస్తరిస్తుంది. వ్యాధిని ప్రాథమికదశలో గుర్తించి చికిత్స చేసినట్లయితే పూర్తిగా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సొరియాసిస్ రావడానికి అనేక కారణాలున్నప్పటికీ ముఖ్యంగా ఆహార సంబంధమైన, జీవనశైలికి సంబంధించినవి ప్రధానంగా ఉంటాయి. జన్యుపరమైన అంశాలు కూడా సొరియాసిస్‌కు కారణమవుతాయి.
గుర్తించడమెలా?
సొరియాసిస్ ముందుగా తలమీద చుండ్రులా కనిపిస్తుంది. చాలా మంది దీన్ని గుర్తించలేకపోతారు. అప్పుడే గుర్తించగలిగతే కొద్దిపాటి చికిత్సతో తగ్గించవచ్చు. గుర్తించడంలో ఆలస్యమైతే క్రమేణా తల నుంచి శరీరంలోని పలు భాగాల్లోకి, చర్మం మీదికి వ్యాపిస్తుంది. ఈ స్థితిలో చర్మం బాగా పొడిబారిపోయి మచ్చలు తయారవుతాయి. క్రమంగా చర్మం మీద పగుళ్ళు వచ్చి చర్మం నుంచి ద్రవాలు స్రవిస్తాయి. దురద మొదలవుతుంది. దురద పగటి వేళ కన్నా రాత్రివేళ ఎక్కువగా ఉంటుంది.
రసధాతువు నుంచి వ్యాధి రక్తధాతువులోకి వెళ్లినపుడు వ్యాధి తీవ్రత పెరిగి చర్మమంతా మచ్చలు, మచ్చల్లో నుంచి చీము, శరీరమంతా వేడిగానూ, చర్మం ఉబ్బినట్లు గానూ కనిపిస్తుంది. వ్యాధి మాంసధాతువులోకి ప్రవేశించినపుడు పైలక్షణాలతో పాటు మచ్చలు మందంగాను, గరుకుగాను, మచ్చల మీద గుల్లలు, పగుళ్లు కూడా ఏర్పడతాయి. వ్యాధి మేధోధాతువు అంటే కొవ్వు భాగంలోకి వ్యాపించినపుడు పైలక్షణాలకు తోడు మచ్చల మీద పుండు ఏర్పడి వాటిలో నుంచి స్రావాలు వస్తుంటాయి. కీళ్లలో నొప్పి ఉంటుంది.
వ్యాధి అస్తి ధాతువులోకి ప్రవేశించినపుడు కళ్ళు ఎర్రబారడం, ముక్కుభాగమంతా కందిపోయినట్లు ఉండటం, దుర్గంధంతో కూడిన చెమట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి శుక్ర ధాతువులోకి ప్రవేశించినపుడు హార్మోన్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆ స్థితికి చేరిన వారు అప్పటికైనా సరియైన చికిత్స తీసుకోకపోతే వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చర్మంపై నల్లమచ్చలు సొరియాసిస్ బాగా ముదిరినపుడు చర్మంపై చేపపొట్టు లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పలు వర్ణాల్లో ఉంటాయి. సొరియాసిస్ రావడానికి ముందు కొందరి చర్మం మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీటికి కారణం శరీరంలో జరిగే వివిధ మార్పుల వల్ల ఆకలికాకపోవడం, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడంలాంటి సమస్యలు. జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు సహజంగానే శరీరంలో కల్మషాలు పేరుకుపోతాయి. ఈ కల్మషాలు శ్రోతస్సులో అడ్డుపడతాయి. ఫలితంగా ధాతువులు శక్తిహీనం అవుతాయి. శ్రోతస్సులు, ధాతువులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించలేనప్పుడు శరీరం రోగగ్రస్తమవుతుంది. అయితే సొరియాసిస్‌గా మారడానికి ముందు మచ్చలు వస్తూపోతూ ఉంటాయి.
విరుద్ధ ఆహారం ఆయుర్వేద శాస్త్ర ప్రకారం విరుద్ధ ఆహారాలు తీసుకోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఒకే భోజనంలో చేపకూరతో పాటు పెరుగు తీసుకోవడం, గుడ్డుతో పాటు పెరుగు తీసుకోవడం, తేనె-నెయ్యి సమభాగాలుగా తీసుకోవడం వంటి చర్యలు ఈ వ్యాధికి దారితీస్తాయని చెప్పవచ్చు.
ఒత్తిడీ ఒక కారణమే సొరియాసిస్ వ్యాధిని సైకోసమాటిక్ వ్యాధిగా పరిగణిస్తారు. సొరియాసిస్ తీవ్రం కావడానికి మానసిక ఒత్తిళ్ళు కూడా కారణమవుతాయి. ఒత్తిడి ఎక్కువయినపుడు మెదడు నుంచి కటిచో కలమైన్స్ అనే కొన్ని రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు అధికంగా విడుదలవడం కూడా వ్యాధి తీవ్రతకు కారణమని చెప్పవచ్చు. తైలమర్దనంతో చికిత్స
శరీరం లోపలికి మందులివ్వడంతో పాటు శరీర భాగానికి తైలమర్దనం, శ్వాసక్రియను చక్కదిద్దేందుకు బ్రీత్‌వర్క్ చేయడం చాలా అవసరం. సొరియాసిస్ రావడానికి ఎన్ని కారణాలున్నా వాటి మూలాలైన వాత, పిత్త, కఫాల వ్యత్యాసాలను తొలగించడం ఈ చికిత్సలో ప్రధానాంశం. చర్మం పొడిబారినపుడు తైలమర్దన చికిత్సల వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వంశానుగతంగా వస్తుంటే... సొరియాసిస్ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరికి సొరియాసిస్ ఉంటే వారి పిల్లల్లో 8 శాతం మందికి, ఒకవేళ ఇద్దరికీ ఉన్నట్లయితే రెట్టింపు శాతం మందికి వచ్చే అవకాశం ఉంటుంది. సొరియాసిస్ వ్యాధి వారసత్వంగా పిల్లలకు రాకుండా ఉండటానికి ఆయుర్వేదంలో స్వర్ణబిందు ప్రాశన అనే ప్రత్యేకమైన ఔషధం ఉంది. సొరియాసిస్ వారసత్వంగా రాకుండా ఉండటానికి ఈ మందు బాగా పనిచేస్తుంది. పుట్టిన 16 రోజుల వయసు నుంచి 16 సంవత్సరాల వరకు ఏ వయసులో వారికైనా వేయవచ్చు. ప్రత్యేకంగా పుష్యమీ నక్షత్రం రోజున ఈ మందు వేస్తారు. వీటిని నెలకొకసారి చొప్పున 24 నెలలపాటు వేయవలసి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more