Biography Of Nedurumalli Janardhana Reddy Who Is Former Chief Minister Of United Andhra Pradesh

Nedurumalli janardhana reddy biography former chief minister united andhra pradesh

Nedurumalli Janardhana Reddy, Nedurumalli Janardhana Reddy former cm, Nedurumalli Janardhana Reddy history, Nedurumalli Janardhana Reddy wikipedia, Nedurumalli Janardhana Reddy life story, andhra pradesh chief ministers, ap formers cms list, united ap chief ministers, telugu states politics

Nedurumalli Janardhana Reddy biography former chief minister united andhra pradesh : The Biography of Nedurumalli Janardhana Reddy Who Is Former Chief Minister Of United Andhra Pradesh. He entered in politics as parliament member.

సాధారణ నేత నుంచి సీఎంగా ఎదిగిన నెదురుమల్లి

Posted: 05/11/2015 08:33 PM IST
Nedurumalli janardhana reddy biography former chief minister united andhra pradesh

రాష్ట్ర రాజకీయాల్లో ఒక సాధారణ స్థాయి నుంచి సీఎంగా ఎదగడం అంతా ఆషామాషీ విషయం కాదు. తమ ప్రతిభ ఏంటో నిరూపించుకోవడంతోపాటు పార్టీ ప్రతిష్టను దిగజారకుండా ప్రజాసేవ చేయగలమనే నమ్మకం, ప్రణాళికలను చేపట్టే విధానాలపై అధికారులకు భోరాసా కలిగించాలి. అంతేకాదు.. ప్రజల్లో మమేకమై వారికి ఒక ‘లీడర్’గా గుర్తింపు సాధించాల్సి వుంటుంది. ఇలా ఎన్నోరకాల స్థితిగతులకనుగుణంగా ముందుకు సాగితేగానీ సీఎం పదవి దక్కదు. ఈ విధంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఓ సాధారణ నేత నుంచి సీఎంగా ఎదిగినవారిలో నెదురుమల్లి జనార్థనరెడ్డిని ఒకరిగా చెప్పుకోవచ్చు.

జీవిత చరిత్ర :

1935 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు గ్రామంలో నివాసముండే శేషమ్మ, సుబ్బరామిరెడ్డి దంపతులకు నెదురుమల్లి జనార్ధనరెడ్డి జన్మించారు. నెల్లూరులోనే బి.ఏ., బి.ఎడ్. వరకు విద్యనభ్యసించారు. ఈయనకు రాజ్యలక్ష్మితో 1962 మే 25న వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు. ఈయన భార్య రాజ్యలక్ష్మి 2004లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందింది.

నెదురుమల్లి రాజకీయ ప్రస్థానం :

1972లో రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి.. ఆ తర్వాత రాజకీయరంగంలో ఎన్నోపదవులు చేపడుతూ తనకంటూ ప్రత్యక ముద్ర వేయించుకున్నారు. ఆరేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగిన ఈయన.. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి’ (పిసిసి) కార్యదర్శిగా నియమించబడ్డారు. 1978లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై, రాష్ట్ర మంత్రివర్గంలో పదవి కూడా పొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1988లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1989లో మళ్ళీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిమండలిలో చోటు సంపాదించారు.

1991లో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలకు నైతిక బాధ్యత వహిస్తూ మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో కాంగ్రేస్ అధిష్టానం నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 1992లో రాజీనామా చేసే వరకు ఈ పదవిలో ఉండి, 1998లో 12వ లోక్‌సభకు, 1999లో 13వ లోక్‌సభకు మళ్ళీ ఎన్నికయ్యారు. అతిముఖ్యమైన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో 14వ లోక్‌సభకు విశాఖపట్టణం నియోజకవర్గం నుండి ఎన్నికై మూడోసారి లోక్‌సభకు వెళ్ళారు. పునర్విభజనలో జనరల్ స్థానంగా మారిన నెల్లూరు నుండి పోటీచేయాలని భావించిన జనార్దనరెడ్డికి సీటు లభించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాల్సి వచ్చింది.

హత్యాయత్నం :

నెదురుమల్లి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలో ఈయన 1992 మేలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు. దీంతో ఆయన నక్సలైట్ల హిట్‌లిస్టులో ఉన్నారు. ఆయనను చంపాలని ఎన్నోరకాలుగా ప్రయత్నాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే 2007 సెప్టెంబర్ 7వ తేదీన రిమోట్ కంట్రోల్ ద్వారా మావోయిస్టులు ఈయన ప్రయాణిస్తున్న కారును పేల్చివేయడానికి కుట్రపన్నారు. పథకం ప్రకారమే వారు బాంబు పేల్చగా.. ఆ ఘటన నుంచి జనార్థన్ రెడ్డి, ఆయన భార్య రాజ్యలక్ష్మి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అయితే ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందారు. 2003లో కూడా ఇదే తరహా దాడి జరుపగా అప్పుడూ క్షేమంగానే తప్పించుకున్నారు.

నెదరుమల్లి జీవితానికి సంబంధించిన విశేషాలు :

* 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
* 1978 నుంచి 84వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు.
* 1989లో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
* 1990 నుంచి 92 వరకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
* 1978 నుంచి 83 వరకు రాష్ట్ర రెవెన్యూ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.
* 1978-83 మధ్య విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
* 1989-90లో వ్యవసాయ, అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు
* 1998-99లో బాపట్ల నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
* 1999 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా ఎన్నికయ్యారు.
* 2004 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు.
* 2009లో రాజ్యసభకు ఎంపికయ్యారు.
* 2007లో నక్సల్స్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
* కాలేయ వాధ్యితో బాధపడుతూ నిమ్స్‌లో ఆసుపత్రిలో 2014 మే 9వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nedurumalli Janardhana Reddy  Andhra Pradesh CMs  

Other Articles