Tyagaraja biography greatest composers of Carnatic Indian classical music | biography

Tyagaraja biography greatest composers of carnatic indian classical music

Tyagaraja biography greatest composers of Carnatic Indian classical music : The Biography of Kakarla Tyagabrahmam, also known as Tyāgayya in Telugu, Tyāgarājar in Tamil, was one of the greatest composers of Carnatic music or Indian classical music.

Tyagaraja biography greatest composers of Carnatic Indian classical music : The Biography of Kakarla Tyagabrahmam, also known as Tyāgayya in Telugu, Tyāgarājar in Tamil, was one of the greatest composers of Carnatic music or Indian classical music.

నాదోపాసన ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చన్న విధ్వాంసుడు

Posted: 05/06/2015 07:22 PM IST
Tyagaraja biography greatest composers of carnatic indian classical music

ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలకు నిలయంగా నిలిచిన భారతదేశంలో భగవంతునిపై విశేషభక్తిని చాటిచెప్పిన ఎందరో భక్తులు జన్మించారు. తమ గానంతో, పద్యాలతో, రచనలతో దేవుని విశిష్టతను రానున్న తరాలకి తెలిసేలా ఎన్నో కార్యాలు చేపట్టారు. అటువంటివారిలో త్యాగరాజు కూడా ఒకరు! కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడైన ఈయన.. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.

బాల్యం, విద్యాభ్యాసం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో 1767లో త్యాగరాజు  జన్మించాడు. ఈయన కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. త్యాగయ్య విద్య కోసం ఆయన తండ్రి రామబ్రహ్మం తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు వెళ్లారు. అక్కడ త్యాగయ్య సంస్కృతం, వేదవేదాంగాలను అమూలాగ్రము పఠించారు. సంగీతాభ్యసము కోసం ఈయన శొంఠి వేంకటరమణయ్య దగ్గర శిక్షణ పొందారు. సంగీతం పట్ల త్యాగయ్యకు వున్న ఆసక్తిని గమనించి.. వెంకటరమణయ్య అతి శ్రద్ధతో ఆయన సంగీతోపదేశము చేశారు.

జీవిత విశేషాలు

త్యాగయ్య చిన్న వయస్సులోనే ఆయన తండ్రి మరణించారు. దీంతో ఆయన అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారంలో త్యాగయ్య భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహాలు వచ్చాయి. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించేవారు. తన యిష్టదైవమైన ‘శ్రీరాములు’పై కృతులు రచించడంలోనే ఎక్కువ సమయం కేటాయించేవారు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందారు. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక ముందే అతడు మరణించాడు.

సంగీత ప్రతిభ

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. 13  ఏళ్ల చిరు ప్రాయం నాడే త్యాగరాజు ‘నమో నమో రాఘవా’ అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ‘ఎందరో మహానుభావులు’ అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పారు.

ఆ విషయం విని రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.

తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగబాధను తట్టుకోలేక, రాముడులేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.

త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి,"స్వరార్నవ"మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన ‘సాధించెనే’ అనీ చెపుతారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించారు. ‘దివ్యనామ సంకీర్తనలు’, ‘ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు’ అనే బృంద కీర్తనలు కూడా రచించెను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tyagaraja biography  Indian Classical Music  

Other Articles