Bommireddy nagi reddy telugu producer biography dadasaheb phalke award winner tollywood news

bommireddy nagi reddy news, bommireddy nagi reddy biography, bommireddy nagi reddy life story, bommireddy nagi reddy life history, bommireddy nagi reddy wiki, bommireddy nagi reddy wikipedia in telugu, bommireddy nagi reddy story, bommireddy nagi reddy awards, dadasaheb phalke award, telugu producers, tollywood producers

bommireddy nagi reddy telugu producer biography dadasaheb phalke award winner tollywood news

‘‘ఫాల్కే’’ అవార్డు అందుకున్న రైతు కుటుంబీకుడు

Posted: 12/02/2014 12:49 PM IST
Bommireddy nagi reddy telugu producer biography dadasaheb phalke award winner tollywood news

చలనచిత్ర పరిశ్రమలో విశేష సేవలు అందించడంతోబాటు సందేశాత్మక చిత్రాలను నిర్మించి, నలుగురికి ఆదర్శంగా నిలిచిన నిర్మాతలు ఇండస్ట్రీలో ఎంతోమంది వున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే చెరగని ముద్రవేసుకుని ‘‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’’లాంటి గొప్ప పురస్కారాన్ని అందుకున్నవాళ్లు మాత్రం తక్కువేనని చెప్పాలి. అటువంటివారిలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఒకరు. ఈయన తెలుగు సినీనిర్మాత. ఒక సాధారణ రైతుకుటుంబం నుంచి వచ్చిన ఈయన.. ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం నిర్మాతగా మారి ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు. స్వాతంత్ర్యపోరాటాలతోబాటు ఆధ్యాత్మిక, సందేశాత్మక చిత్రాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

జీవిత విశేషాలు :

1912 డిసెంబర్ 2వ తేదీన  కడప జిల్లా ‌పొట్టింపాడు గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. బాల్యంనుంచే పురాణగ్రంథాలను, ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను వంటివాటిమీద ఒక ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకోవడం వల్ల.. 12ఏళ్లకే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగారు. అవే ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. తర్వాత  మద్రాసు గరాన్ని చేరుకుని పాఠశాల విద్య అభ్యసించాడు. విద్య పూర్తికాగానే తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.

అయితే యువకుడిగా వున్న సమయంలో స్వాతంత్ర్యోద్యమానికి ఆకర్షితుడైన ఆయన.. ఖాదీ ఉద్యమంతోబాటు ఇతర నినాదాల్లో పాల్గొన్నారు. కానీ వ్యాపార నిమిత్తం బర్మాలోనే వుండాల్సి వచ్చింది. అప్పుడు రెండవ ప్రపంచయుద్ధ సమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతినడం వల్ల తిరిగి కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో ఆయన ప్రింటింగ్ ప్రెస్’ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ‘ఆంధ్రజ్యోతి’ అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించారు. తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశారు. అనంతరం 1974లో ఆయన దృష్టి వైద్యరంగంమీదకి మళ్లడంతో రెండు ఆసుపత్రులను నిర్మించి, పేదవర్గాల వారికి సహాయాన్ని అందించారు.

చిత్రరంగంలో ఆయన పాత్ర :

రెండో ప్రపంచయుద్ధంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్న తరుణంలో ఆయన తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే ఆనాడు భక్తపోతన చిత్రానికి దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి తన సినిమాను పబ్లిసిటీ వ్యవహారాలను నాగిరెడ్డికి అప్పగించారు. మొదటినుంచే నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఎక్కువ ఆసక్తివుందని తెలుసుకన్న ఆయన.. ఆ విధంగా తనకు ఆ అవకాశాన్నిచ్చారు. తర్వాత జెమినీ సంస్థవారు నిర్మించిన సినిమాకు ఆయన భారీగా పబ్లిసిటీ చేశారు. ఇలా సాగుతుండగానే ఆయన నిర్మాతగా అవతరించారు. 1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయాప్రొడక్షన్స్ స్థాపించారు.

ఆవిధంగా ప్రొడక్షన్స్ స్థాపించిన అనంతరం ఆయన ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలను తెరకెక్కించి తెలుగు సినీచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించారు. 1950లో వచ్చిన ‘షావుకారు’తో మొదులకుని 1962లో వచ్చిన ‘గుండమ్మకథ’ వరకు అత్యధిక స్థానంలో కొనసాగింది. ‘పాతాళభైరవి, పెళ్లి చేసిచూడు, చంద్రహారం, మిస్పమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు’ వంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించి.. భారీగా లాభాలను ఆర్జించింది. అయితే తర్వాత వచ్చిన సినిమా ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. ఈవిధంగా పరిశ్రమకు మంచిచిత్రాలు అందించి చెరగని ముద్రతో ఫాల్కే అవార్డు గ్రహించన ఆయన.. 2004 ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు.

గుర్తింపు-గౌరవాలు :

1. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1987లో)
2. TMA పాయ్ అవార్డు
3. రఘుపతి వెంకయ్య అవార్డు
4. తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు (1972లో)
5. శ్రీవేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలనుంచి గౌరవడాక్టరేట్లు

నిర్వహించిన పదవులు :

1. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా రెండు సార్లు
2. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాలుగుసార్లు
3. 1980-83 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షుడిగా
4. ఆయన నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు కూడా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles