Sardar vallabhbhai patel biography who is named as iron man of india

sardar vallabhbhai patel, sardar vallabhbhai patel news, sardar vallabhbhai patel birthday, sardar vallabhbhai patel deathday, sardar vallabhbhai patel latest news, sardar vallabhbhai patel biography, sardar vallabhbhai patel life story, sardar vallabhbhai patel life history, sardar vallabhbhai patel life, sardar vallabhbhai patel story, sardar vallabhbhai patel wikipedia, sardar vallabhbhai patel wiki, sardar vallabhbhai patel wikipedia in telugu, telugu news, indian freedom fighters, mahatma gandhi, indian national congress

sardar vallabhbhai patel biography who is named as iron man of india

భారతదేశపు ఉక్కుమనిషిగా పేరుగాంచిన స్వాతంత్ర్యయోధుడు!

Posted: 10/31/2014 03:14 PM IST
Sardar vallabhbhai patel biography who is named as iron man of india

ఆనాడు బ్రిటీష్ పరిపాలనాకాలంలో భారతదేశ స్వాతంత్ర్యసమర పోరాటాల్లో పాల్గొన్న ఎందరో ప్రముఖుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు! అంతేకాదు.. స్వాతంత్ర్యానంతరం ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి కృష్టిచేసి.. ప్రముఖుడిగా పేరొందారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు దేశంలో విలీనం చేసిన ఘనత ఈయనదే! ఇంగ్లాండులో బారిష్టరు పట్టాపొందిన అనంతరం దేశానికి తిరిగివచ్చిన సమయంలో ఇక్కడ జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై మహాత్మాగాంధీ నేతృత్వంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. అలాగే దేశప్రజల సంక్షేమంకోసం ఎన్నో సాంఘిక ఉద్యమాలను చేపట్టారు. రాజకీయరంగంలోనూ ఎన్నో పదవులను చేపట్టారు. దేశవిభజన అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేయడంలో తన చాకచక్యాన్ని చాటుకున్నారు. అందుకే ఈయనను ‘‘భారతదేశపు ఉక్కుమనిషి’’గా పేర్కొంటారు.

జీవిత చరిత్ర :

1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియాడ్ లో నివాసమున్న జవేరీ భాయి - లాడ్‌లా పటేల్‌లకు వల్లభభాయి పటేల్ నాల్గవ సంతానంగా జన్మించారు. స్థానికంగానే ప్రాథమిక విద్యాభ్యాసాన్నిపూర్తిచేసిన పటేల్.. ఉన్నతన్యాయశాస్ట్ర చదువులకోసం ఇంగ్లాండుకెళ్లి బారిష్టర్ పట్టాపొందారు. అనంతరం దేశానికి తిరిగొచ్చిన తర్వాత అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తర్వాత ఝవెర్బాను పెళ్లాడిన ఆయన.. ఆ దంపతులకు కుమార్తె మణిబెన్, కుమారుడు దహ్యాభాయ్ జన్మించారు. 1909లో ఆయన భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించింది. అయితే ఈయన రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లలను పెద్దవాళ్లను చేశారు.

ఇతర విశేషాలు :

ఇంగ్లాండులో బారిష్టర్ పట్టాపొందిన అనంతరం దేశానికి తిరిగొచ్చిన ఆయన.. ఇక్కడ జరుగుతున్న భారత జాతీయోద్యమానికి ఆకర్షితుడై... గాంధీజి చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ‘‘బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం’’ విధించిన పన్నులకు వ్యతిరేకంగా 1928లో బార్దోలీలో ‘‘కిసాన్ ఉద్యమం’’ను చేపట్టి విజయవంతంగా నడిపించారు. అప్పుడే ఆయనకు ‘‘సర్దార్’’ అనే పేరొచ్చింది. గాంధీ చేపట్టిన సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని, దాదాపు 3, 00000 మంది సభ్యులతో కలిసి రూ.15 లక్షల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తాను ఎంతోమోజుగా వేసుకునే తెల్లదొరల బట్టలను అగ్నికి ఆహుతి చేశారు. గుజరాత్ లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ప్రముఖపాత్ర వహించారు.

ఆనాడు రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా మంచి సహకారాన్ని అందించారు. ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లోఇండియన్ లాకు నామినేట్ చేయు విధానాన్ని ఆయనే ప్రతిపాదించారు. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉపప్రధానమంత్రిగాను పదవులను చేపట్టారు. అయితే ఉపప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో 1950 డిసెంబర్ 15న మరణించారు. అయితే ఆ పదవిలో కేవలం 40 మాసాలు మాత్రమే వున్న ఆయన.. దేశసమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించారు. కానీ ముస్లింల పట్ల ఈయన వివక్షకు పాల్పడ్డారంటూ ఎందరో జాతీయవాదులు సైతం విమర్శించారు. కానీ దేశప్రజలను ఆకట్టుకోవడంలో ఈయన కీలకపాత్రను పోషించారు. ఈయన అందించిన సేవలకుగానూ భారతప్రభుత్వం 1991లో ‘‘బారతరత్న’’ బిరుదును ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles