Homi jehangir bhabha biography who is the famous scientist of nuclear physics named as father of nuclear programme

homi jehangir bhabha, homi jehangir bhabha news, homi jehangir bhabha birthday, homi jehangir bhabha death day, homi jehangir bhabha latest news, homi jehangir bhabha latest updates, indian scientist homi jehangir bhabha, homi jehangir bhabha biography, homi jehangir bhabha life story, homi jehangir bhabha life history, homi jehangir bhabha story, homi jehangir bhabha life news

homi jehangir bhabha biography who is the famous scientist of Nuclear physics named as father of nuclear programme

భారత అణుశక్తి కార్యక్రమానికి పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త!

Posted: 10/30/2014 03:42 PM IST
Homi jehangir bhabha biography who is the famous scientist of nuclear physics named as father of nuclear programme

ప్రస్తుత భారతదేశంలో వున్న అణు పరిశోధన కార్యక్రమాలు ఇంతగా అభివృద్ధి చెందడానికి ముఖ్యపాత్రలు పోషించిన ఎందరో మహానుభావుల కృషి దాగివుంది. అటువంటివారిలో ‘‘హోమీ జహంగీర్ భాబా’’ కూడా ఒకరు. ఇతును ఒక గొప్ప అణు భౌతికశాస్త్రవేత్త! ఈయన భారత అనుశక్తి కార్యక్రమం అభివృద్ధిలో కీలకపాత్రను పోషించి.. దానికి ‘‘పితామహుడిగా’’ పేరుగాంచారు. అంతేకాదు.. ఈయన దేశంలో ప్రసిద్ధ చెందిన ఎన్నో సంస్థలలో తన సేవలను అందించి.. ఎన్నో పురస్కారాలను సంపాదించుకోగలిగారు.

జీవిత చరిత్ర :

1909 అక్టోబర్ 30వ తేదీన బ్రిటీష్ ఇండియా కాలంలోని బొంబాయి నగరంలో జన్మించారు. ఈయన ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించడం వల్ల ఎందరో ప్రముఖ వ్యక్తులతో సంబంధం వుండేది. బొంబాయిలో తన పాఠశాల విద్యతోపాటు ఉన్నత చదువులను రాయల్ ఇన్స్ టిట్యూట్ ఆప్ సైన్సు కళాశాలలో పూర్తిచేసిన అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ ను అభ్యసించడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కైస్ కళాశాలకు హాజరయ్యారు. తర్వాత మ్యాథమెటిక్స్ ట్రిపోస్‌ను పాల్ డిరాక్ వద్ద అభ్యసించారు. ఆ సమయంలోనే ఆయన సిద్ధాంతపరమైన భౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందేందుకు కావెండిష్ లేబరేటరీలో R. H. ఫౌలర్ వద్ద కొన్నాళ్లపాటు పనిచేశారు. అప్పుడే కాస్మిక్ కిరణాల శోషణగుణం, ఎలక్ట్రానుల ధారాళ ఉత్పత్తిలో బలమైన పరిశోధనను చేశారు.

విధుల నిర్వహణ :

ఆయనకు సెలవులు లభించిన కారణంగా విదేశాలనుంచి భారతదేశానికి తిరగొచ్చారు. అయితే అప్పుడు రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో కొన్నాళ్ల ఇండియాలోనే వుందామని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆయన బెంగుళూరులోని  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఒక పదవిని పోషించారు. ఆ సంస్థలో అతను కాస్మిక్ రే రిసర్చ్ యూనిట్‌ను స్థాపించడంతోపాటు పాయింట్ పార్టికల్స్ కదలిక సిద్ధాంతం మీద పనిచేయటం ఆరంభించారు. 1945లో బొంబాయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.

1950లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఫోరంలలో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఈయన అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1954లో ఈయనను ‘‘పద్మభూషణ్’’ పురస్కారంతో సత్కరించింది. అనంతరం 1955లో జెనీవా, స్విట్జంర్లాండ్‌లో అణుశక్తి శాంతియుతమైన ఉపయోగాల మీద జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధ్యక్షడిగా ఉన్నారు. అలాగే భారత మంత్రిమండలి సాంకేతిక సలహాదారు సంఘానికి సభ్యుడిగా వుంటూ... విక్రమ్ సారాభాయితో కలిసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పరచారు.

భౌతికశాస్త్రంలో పరిశోధన :

1933 జనవరిలో భాబా ‘‘జుర్ అబ్జార్ప్‌షన్ దేర్ హోహెన్‌స్ట్రాహ్లాంగ్’’ పేరిట మొదటి శాస్త్రీయ పరిశోధనను ప్రచురించారు. దీనిని జర్మన్ విద్యా పత్రిక జీట్‌స్చరిఫ్ట్ ఫర్ ఫిజిక్ (భౌతికశాస్త్రం పత్రిక)లో ప్రచురించారు. అనంతరం రాల్ఫ్ H. ఫౌలేర్ పర్యవేక్షణలో సిద్ధాంతపరమైన భౌతికశాస్త్రంలో డాక్టరల్ అధ్యయనాలను పూర్తి చేశారు. 1935లో ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ, సిరీస్ Aలో ఒక పరిశోధనను ప్రచురించారు. 1936లో భాభా వాల్టర్ హీట్లర్‌తో కలిసి కాస్మిక్ కిరణపాతాల మీద ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచారు. ఇందులో గామా కిరణాల క్రమానుసార ఉత్పత్తిచే ఏర్పడిన ప్రవాహాలు... పాజిటివ్-నెగటివ్ ఎలక్ట్రాను జంటలను సంయోగం చేశారు.

తర్వాత 1939లో అప్పటిలో ప్రముఖ భాతికశాస్త్రవేత్త అయిన C. V. రామన్ అధికారంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సులోని  భౌతికశాస్త్రం విభాగంలో రీడర్‌గా ఉండటానికి వచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించారు. రెండవ ప్రపంచయుద్ధం ముగింపుతోపాటు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన అణుశక్తి శాంతిపూర్వక అభివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకు జవహర్ లాల్ నెహ్రూ ఆయనను మెచ్చుకున్నారు. 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. అనంతరం నెహ్రూతో కలిసి అణుకార్యక్రమంతోపాటు విద్యాసంస్కరణలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్రను పోషించారు.

మరణం :

1966 జవనరిలో ఆస్ట్రియా, వియన్నా దేశాలలో నిర్వహించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహాదారు సంఘం సమావేశానికి హాజరయ్యేందుకు ఒక విమానంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోనే మోంట్ బ్లాంక్ వద్ద ఆ విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారు. అయితే ఈ మరణం వెనుక అప్పట్లో ఎన్నో కథాంశాలు ప్రచురించబడ్డాయి. ఈయనను కావాలనే ఎవరో చంపించారంటూ వదంతులు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : homi jehangir bhabha  indian scientists  indian nuclear programme  telugu news  

Other Articles