Dasari narayana rao completes 40 yrs as director

dasari narayana rao to complete 40 years as director, tollywood, dasari, narayana rao, veteran director, producer, dharshaka ratna, prathap arts, thatha manavadu, osey ramulamma, maega sandesham, taraka prabhu, manju, siva, ranjani

Dasari Narayana Rao to complete 40 years as director

దర్శకరత్న దాసరి నారాయణరావు 40 ఏళ్ళ సినీ ప్రస్థానం

Posted: 03/26/2013 03:36 PM IST
Dasari narayana rao completes 40 yrs as director

director dasari

తెలుగు సినీ రంగానికి ఆయనో చుక్కాని. బాల్యంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించి నాటకాల్లో తన సత్తాను నిరూపించుకుని సినిమాల్లోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలో కథనాయకుడు అంటూ ఎవరూ లేరు. కథే కథానాయకుడు అంటూ చిత్రం తీసి ఘనవిజయం సాధించారు. ఈయన తీసిన చిత్రాల్లో ఎక్కువగా కథేక ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్‌టిఆర్‌, ఎఎన్‌ఆర్‌ లాంటి దిగ్గజాలతో పలు చిత్రాలు తీసి వారికి స్టార్‌ డవ్గు తీసుకురావడంతో పాటు ఆయన ఇమేజ్‌ పెంచుకున్నారు. అగ్ర హీరోలతో సమానంగా గుర్తింపు ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరంటే అతిశయోక్తి కాదు. 150 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారీ దర్శకరత్న. ఎందరినో చిత్రసీమకు పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసినవారు నేడు స్టార్‌ హీరోలు, హీరోయిన్లుగా ఎదిగారు. టాలీవుడ్గకు పెద్ద దిక్కుగా పేరొందిన ఈయనే దాసరి నారాయణ రావు. సినీ పరిశ్రమలో అడుగిడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా...

dasari

ఒక్క సంతానమే ఉంటె ఆత్మీయత తెలియదు, కుటుంబం విలువ, ప్రేమ - అభిమానాల్ని పంచుకునే తత్త్వం అవలంబించదు, అందుకే కనీసం ఇద్దరు పిల్లలయినా ఉంటె ఒకరికొకరు తోడుగా ఉండటమే కాకుండా , తల్లి - తండ్రుల బాధ్యతా ను మాలి వయస్సు లో పట్టించుకుంటారు ... ఈ ఆలోచన నుండి ఇంకా మన సమాజం బయటకు రాలేదు ... అయితే ఒక్క సంతానం అయినా , ఇద్దరు పిల్లలున్నా , ఎవరి దారి వారు చూసుకుని, వీలయితే స్వస్థలం లో ఉన్న తమ తల్లి - తండ్రులకు ఏదో మొక్కుబడిగా డబ్బు పంపిస్తూ , కన్నా వారి బాధ్యత బరువుగా భావించే పిల్లలని మన చుట్టు పక్కల, కుటుంబం లో మనం చూస్తూనే ఉంటాం ... ఏమో మనమే ఒకానొక దశలో ఇలా ప్రవర్తిన్చామో , ప్రవర్తిస్తూ ఉండి ఈ విషయం ఒప్పుకోడానికి సిగ్గు పడుతున్నామేమో ... ఇలాంటి సంఘటనలు ఇప్పుడు సదా మామూలే అయినా , 40 సంవత్సరాల క్రితం కూడా షరా మామూలుగానే జరిగేవి అనడానికి నిదర్సనం , తెలుగు సినిమా చరిత్రలోనే మరచిపోలేని సూపర్ హిట్ లు అందించిన దర్శకుడు దాసరి నారాయణ రావు కి ఒచ్చిన ఆలోచన ... ఈ ఆలోచనే 'తాత - మనవడు' చిత్రానికి శ్రీకారం చుట్టింది , దర్శకుడు గా దాసరి నారాయణ రావు తోలి సినిమా తోనే ఘన విజయం అందుకుని, తిరుగులేని స్థాయి లో ఎదిగేందుకు దోహద పడింది ...

tatamanavadu movieతాత - మనవడు కధ అనుకునే నాటికి దాసరి గారికి తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎందరో పేరు మోసిన దర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన అనుభవం ఉంది ... అయితే అవకాశాలకు ఏ మాత్రం కొదవ లేదు ... కాని ఈ సమయం లో యాక్షన్ సినిమాలకు చెప్పలేనంత డిమాండ్ ... తన కధ తో ఏ నిర్మాతని కలసినా, 'యాక్షన్ కధ అయితే బాగుంటుంది ' అని అన్న వారే ... కాని, నిర్మాత కె. రాఘవ గారు మాత్రం రెండు - మూడు యాక్షన్ కధలు విన్నా, తాత - మనవడు కధ నచ్చి ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు ... యస్ . వీ. రంగా రావు గారు , అంజలి దేవి గారు, విజయ నిర్మల గారు , రాజ బాబు గారు ఇలా నటీ నటులందరూ వారి వారి పాత్రల్లో లీనమయిపోయి నటించారు ... ముఖ్యం గా యస్ . వీ . ఆర్ . నటన అన్ని వర్గాల వారినీ అమితంగా ఆకట్టుకుని, ఈ మహా నటుడికి తిరుగులేదు అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది ...

సంగీతం దగ్గరి  నుండి కధను నడిపించిన విధానం వరకు ఈ సినిమా అన్ని వర్గాల వారినీ ఆకర్షించి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది ... చరిత్ర సృష్టించిన ఇటువంటి ఆనిముత్యాలని అందించిన లెజెండ్స్ కి జోహార్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles