Director bapu special

Director Bapu, tollywood director bapu, bapu paintings, bapu movies,

Director Bapu special article.

Director Bapu special.png

Posted: 12/27/2012 11:47 AM IST
Director bapu special

Director_Bapuఆయన తన బొమ్మలతో తెలుగు వాకిట ‘ముత్యాలముగ్గు’ వేశాడు. తన సినిమాలతో తెలుగింట ‘గోరింతదీపం’ వెలిగించాడు. ఆయన చేతిలో తెలుగు వనితాగీత వయ్యారాలు పోయింది. కుంచెలో తెలుగు వాతావరణం వెల్లివిరిసింది. గీతలు నవ్వులు సృష్టించాయి. చేతిలో కుంచెలు విరిశాయి. ఆయనే... కొంతసేపు... మన గుండె ఊయలలూపే కొంటె బొమ్మల బాపు.
 
బాపు అంటే పని. రోజుకు ఇరవై గంటల పని... లొంగని గుర్రాల మీద సవారీ... కసి, పట్టుదల వెరసి కలగలిపితే అది బాపు. ఆయన కళాతపస్వి కాదు... అలాగని గడ్డాలు, విగ్గులూ పెంచేసి గుహల్లో దూరిపోడు. తెల్లారగట్ల నాలుగ్గంటలకి లేచి చక్కగా బొమ్మలేస్తాడు. ఈ అమ్మాయి ‘అచ్చం బాపు బొమ్మలా ఉంది’ అని ఎవరైనా అంటే... ఒక తెలుగు అమ్మాయికి అంతకు మించిన పొగడ్త ఉండదు... బాపు తన సినిమాలో హీరోయిన్‌ను అచ్చ తెలుగు అమ్మాయిలా చూపిస్తారు అనే దానికి ఇదే ఉదాహరణ. ఇక బాపు కార్టూన్స్‌ చూస్తే... నవ్వుతాం. తలచుకుంటుంటే కూడా చిరునవ్వు మెదలాల్సిందే... ఏదైనా కథ చదవాలంటే ముందు ఆయన బొమ్మలు చూశాక... అప్పుడు కథ చదువుతాం. బొమ్మల చేత మాలాడించే చిత్రకారుడు ఆయన. బాపు బొమ్మలు చూసిన ప్రతీవాడు అనే మా ఇదే... అయితే... భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారంలో బాపులాంటి తపస్వి వారికి కనబడలేదు. అందరికీ దక్కినట్లుగా ఆయనకు ‘పద్మ’ పురస్కారాలు ఇంతవరకూ దక్కనేలేదు. అలాగని బాపు వాటి కోసం ఏనాడు అర్రులు చాచలేదు. అయితే... ఉన్నట్లుండి మన ప్రభుత్వాలకు ఈ మహానుభావుని ప్రతిభ ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. విషయం ఏమిటంటే ఆయనకు ‘పద్మభూషణ’ పురస్కారం ఇవ్వాలంటూకేంద్రానికి  సిఫార్సు చేస్తూ మన రాష్ర్ట ప్రభుత్వం లేఖాస్త్రం సంధించింది.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం స్టీమర్‌ రోడ్‌ (అప్పట్లో జమిం దార్‌గారి వీధి అనేవారు లెండి)లో ఉండే సత్తిరాజు లక్ష్మీనారా యణ అలా నడుచుకుంటా ఇంటికి దగ్గరలోనే ఉన్న గోదా రొడ్డు కు వెళ్ళి ఆవలి గట్టున కనిపించే అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిలోరిని తలుచుకుంటూ నాన్న అన్న మాటలతో ఆలోచ నలతో సమతమతమయ్యేవారు. తరువాత తనకు వచ్చిన ఆలోచనే ఆచరణలో పెట్టారు... మద్రాసులో ఐదో తరగతి చదువుతు న్నప్పుడే ఓ బొమ్మ గీస్తే... ఓ కవితకు 1945లో బాల పత్రికలో ప్రచురిత మైంది. అలా స్టార్ట్‌ అయిన చిత్రకళతోనే కూడు, గుడ్డ పెట్టేటట్లు చేసిన ఘనత బాపుదే.బుడుగు, సిగానపెసూనంబతో మొదలు
అలాగే తన గ్రాండ్‌ ఫ్రెండ్‌గా ఉన్న ముళ్లపూడి వారితో కలిసి ఎన్నో పౌరాణిక, సాంఘిక కథలకు కళాత్మకత జోడించి జనరం జకంగా చిత్రాలను రూపొందించారు. వీరిద్దరూ కలిసి రూపొం దించిన బుడుగు ఓ తెలుగు క్లాసిక్‌. అందులో ‘బుడుగు’ తో పాటు ‘సిగానపెసూనంబ’ తెలుగువారి హృదయాల్లో ఎప్పటికీ మర్చి పోలేని చిత్ర రాజాలే. బాపు బొమ్మ ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖ చిత్రాలు లెక్కపెట్టడం కష్టం. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈ రోజు చిత్ర శైలికి వాడు తారు. బొమ్మలే కాదు... బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలుపోయాయి. ఇప్పుడు ఆయన చేతిరాత కూడా బాపు ఫాంటుగా అలరిస్తోంది. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపోయాయనటం పొగడ్తా కాదు.

బాపు బొమ్మకు దాసోహం

తెలుగు పల్లెల అందాలు, నదులు, ముఖ్యంగా కృష్ణా, గోదావరి తీరప్రాంతాల సొబగులు, మొత్తం ప్రకృతినే తన కెమెరా కన్నుతో దృశ్యమానం చేస్తాడు. ‘స్త్రీ’ ఆయన కుంచెలో రూపుదిద్దుకు న్నంత అందంగా, నిజ జీవితంలో తారసప డాలని ప్రతివాడూ తపించేవాడే. మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుండి లాయర్‌ పట్టా పుచ్చుకున్నా... ఆంధ్రపత్రిక దినపత్రికలో కార్టూన్లు వేసినా... అసలు నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్థనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావెై... ఇలా ఎన్నో విషయాలపెై బాపు ప్రత్యే క చిత్రావళిని అందించారు. వాటిలో మనకు కనిపించేది పొదుపుగా గీతలు వాడకం, సందర్భానికి తగిన భావం, వాటిలో పూర్తి
తెలుగుతనం.అదే బాపు గొప్ప. ఆయన చిత్రీకరించిన ‘లోగో’లు రామాయణ, భారత, భాగవతాది పురాణ గత పాత్రల చిత్రకల్పన, నవరసాలను, నాట్య రీతులకు కల్పించిన చిత్రగత శాశ్వతత్వం, వేంక టేశ్వర వెైభవ చిత్రాలు ఏవి చూసినా అందం, ఆనందం పరమావధిగా అశేష హృదయాలను రంజింపగల ప్రజ్ఞాని ఆయన. ఏ బొమ్మగీసినా, అది అర్థ వంతంగానూ, ‘ఆనందవర్థనం’గానూ, భాసిం పచేయగల నెైపుణ్యం బాపుకుండేె మహిమే.

Bapuమలుపు తిప్పిన సినీనిర్మాణం

బాపు గీసిన బొమ్మలకూ, వాటి అందాల కూ, అర్థాలకూ, పరమార్థాలకూ, పరవ శించి... పరవశులెై, బాపు బొమ్మకు మోజు చూపేవారు ఆ బొమ్మల ముం దు తామూ వెల వెల బోతున్నామని ఏడిచే మహిళలు, యువతులు ఇప్పటికీ ఇబ్బడి ముబ్బడిగానే ఉన్నారు. ఇది సత్యం. తన చిరకాలమిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి తన మార్కు స్టైలు ఎన్నో చిత్రాలు తీసి చూపించారు. 1967లో ‘సాక్షి ’ చిత్ర దర్శకునిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకున్నారు. సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, ముత్యాల ముగ్గు, శ్రీ రామాంజనేయ యుద్ధ, రాధాకల్యాణం, పెళ్లిపుస్తకం, మిస్టర్‌పెళ్ళాం లాంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవలే ‘శ్రీరామరాజ్యం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచారు. మొత్తం 41 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1976లో వచ్చిన ‘సీతాకల్యాణం’ సినిమాలో ఇప్పుడొస్తున్న టెక్నిక్‌ తెలియని బాపు ఆ సినిమాలో తీసిన ‘గంగావతరణం’ సన్నివేశం మన సినీ పండితులతో పాటు... విదేశీయలను సైతం ఆశ్చర్యపరచింది.

అవార్డులు... అభినందనలు

బాపు దర్శకత్వం వహించి 1975లో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం అందించింది. 1986లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని మదర్‌ థెరిస్సా బహుకరించింది. 1982లో చెన్నైలోని శ్రీరాజ్యలక్ష్మి ఫౌండేషన్‌ పురస్కారం, 1991లో ఆంధ్రా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ కళాప్రపూర్ణ, 1992లో అమెరికా తెలుగు అసోసియేషన్‌ వారి అందించిన శిరోమణి అవార్డు, 1993లో ‘మిస్టర్‌పెళ్ళాం’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం, 1995లో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ఘన సన్మానం, 2001లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టునిస్ట్‌స్‌ జీవిత సాఫల్య పురస్కారం, 2001లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ విశిష్ట పురస్కారాలు అందచేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Information about arvind kejriwal
Legendary musician ravi shankar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles