Telugu language day

Giduku Ramamurthy Pantulu Birthday celebrates as Telugu Language Day Every Year. (29th Augsut)

Giduku Ramamurthy Pantulu Birthday celebrates as Telugu Language Day Every Year. (29th Augsut)

Telugu language day.png

Posted: 08/29/2012 02:45 PM IST
Telugu language day

Telugu_language_day

Annamayyaనేడు ప్రపంచంలో ఎన్నో ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన మాట వాస్తవం. వాటిలో తేనెలొకు మన తేట తెలుగు భాష ప్రస్తుతాని కైతే ప్రమాదం లేదని ఢంకా భజాయించి చెప్పొచ్చు. వేయి సంవత్స రాలకు పైగా తలవంచకుండా రెపరెపలాడుతున్న ఘనచరిత్ర కలి గిన మాతృ భాష మనది. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ గా పేరుగాంచిన తెలుగు వెలుగు... వెలవెలబోయే పరిస్థితి కనీసం మనతరం బ్రతికి ఉండగా రాదు!  అయితే, నానాటికీ మనం పెంచి పోషించుకుంటున్న ‘మమ్మీ, డాడీ ’ల సంస్కృతి ఇలాగే కొనసాగితే మాత్రం... తెలుగు భాషకు భవిష్యత్తులో ఆటంకం తప్పదు. కనుక, మన తెలుగు భాషను కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నేటి తెలుగు యువలోకానిదే అని తెలియజేస్తూ... ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్న నేపథ్యంలో  ప్రత్యేక కథనం...

భావ వ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని భాషల ఆధిపత్యమే నడుస్తున్నా... ఎవరికివారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. ఇలా మాతృభాష గురించి చె ప్పేటప్పుడు మన తెలుగు గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే, మాటకై నా... పాటకైనా మన శైలిలో ఉన్న ప్రత్యేకతే వేరు. అమ్మలా కమ్మనైనది.. మాధుర్యంలో అమృతానికి మించినది.. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’గా గుర్తింపు పొందింది.. ఇలా మన తెలు గు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తెలుగు భాషోద్యమం...సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు. ఆయన ఈ ఉద్యమాన్ని ప్రా రంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కా వొస్తోంది. గ్రాంథిక భాషలో రచనలు చేయని వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉం డాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, స వాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రా చుర్యంలోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సం ఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది ఆ సంస్థ ప్రధాన ఆశయం. 45 ఏళ్ల తర్వాత కూ డా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఐక్యరాజ్య స మితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యా ప్తంగా అంతరించిపోతున్న మాతృభాషల్లో తె లుగు కూడా ఒకటని, దీని కి రెండు దశాబ్దా లలోపు సమయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.

గిడుగు కాదు పిడుగు....

Gidugu_Ram_Murthyఆంధ్రభారతి కృత్రిమ (గ్రాంధిక) అలంకారాల భారంతో కుంగి కృశిస్తూ కళ తిప్పి ఉన్న సమ యంలో సజీవమైన ప్రజల వాడుక భాషా ప్రయోగాల తో ఆంధ్రభారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్య మం నడిపిన మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతు లు. కాలం మారింది... సాహిత్యం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంది. వ్యవహారిక భాషతోనే ఇది సాధ్యమన్నది ఆయన దృఢ విశ్వాసం. సాధారణంగా మార్పును సమాజం అంత తేలికగా అంగీకరించదు. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహానికి ఉద్యమించినపుడు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రబోధించినపుడు ఆయనకు ఎదురైన గట్టి సవాళ్లవంటివే రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టినపుడూ ఎదురయ్యాయి.వ్యవహారిక భాష పేరు తల చుకుంటే తెలుగు సాహిత్యం మైలు పడిపోతుందన్న భాషా ఛాందసులు తెలుగు సాహితీలో కాన్ని ఏలుతున్న రోజులవి. గిడుగు సాహసించి ఈ కొత్త ప్రతిపాదన చేసినపుడు వారు ఎదురుతిరిగారు. అయినా గిడుగు వెనుకంజ వేయలేదు. శద్ధగ్రాంథికవాదులను ఢీకొని వారిని నిరుత్తరులను చేశారు. జయంతి రామయ్యపంతులు, రాజా విక్రమదేవవర్మ, పిఠాపురం రాజా వంటి ఉద్దండులు గిడుగును ఎదుర్కొన్నారు. ఆనాటి వ్యవహారిక ప్రయోగాలను ఉటంకిస్తూ వారివాదాన్ని గిడుగురామ్మూర్తి పంతులు తిప్పికొట్టారు.

తెలుగు వెలుగు...

Shankarambodyశంకరంబాడి తెలుగు రచయి తలలో శంక రంబాడి సుందరా చారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. సుందరాచారి, 1914 ఆగష్టు 10న తిరుపతిలో జన్మించాడు.  మదనపల్లెలో ఇంటర్మీడియే ట్‌ వరకు చదివాడు. చిన్న తనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండే వాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావం దనం వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యా న్ని తెంపివే సాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు.తిరుపతిలో హోటలు సర్వర్‌గా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్రపత్రిక లో ప్రూఫ్‌ రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. అమిత మైన ఆత్మ విశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనా ధుని నాగేశ్వరరావు పంతులు నీకు తెలుగువచ్చా అని అడిగాడు. దానికి సమాధా నంగా మీకు తెలుగు రాదా అని అడిగాడు. నివ్వెరపోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని చెప్పిన మాతృభాషాభిమాని శంకరంబాడి సుందరాచారి.

Garimellaఆంగ్లేయులపై అక్షరాగ్ని గరిమెళ్ళ...

మాకొద్దీ తెల్లదొరతనమూదేవా!
మాకొద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణలపై పొంచి
మానాలు హరియించే...

జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. స్వాతంత్య్ర సంగ్రామం లో పోరాటాలను తమ భుజస్కందాలపై మో స్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగి ల్చిన ఘనకీర్తిగల జాతిమరిచిన జాతిరత్నం గరిమెళ్ల సత్యనారాయణ. స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనా రాయణది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గే యాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడు తూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ తో పాటు ‘దం డాలు దండాలు భారత మాత’ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరి మెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మా రుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరత నం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జా తీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలు గునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

తెలుగు మహాసభలు..

.ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వ హించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమై న పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. 1981 రెండవ ప్ర పంచ తెలుగు మహాసభలు కైలాలంపూర్‌ (మ లేషియా)లో జరుగగా... 1990 మూడవ ప్ర పంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరి గాయి. ఆ తరువాత 37 ఏళ్ళకు ఇప్పుడు మ ళ్లీ రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభ లను డిసెంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలో నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tagubothu ramesh special interview
Indian cinematographer aloysius vincent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles