Dr c narayana reddy

Golden Memoirs,Download Songs of Dr C Narayana Reddy, Rajan Nagendra,Ramesh Naidu,J V Raghavulu,Lyricists: Dr C Narayana Reddy

He is known as one of the most sought after intellectuals in the Telugu film industry and has become a role model for many aspiring lyricists. He is none other than Dr C Narayan Reddy and yesterday, it was his birthday

Dr C Narayana Reddy.png

Posted: 08/14/2012 03:24 PM IST
Dr c narayana reddy

C_Narayana_reddy

Narayana-reddyఆయన మాటలు, ఆలోచింపచేస్తాయి... ఆయన కవితలు, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి... తెలుగు సిని సంగీతానికి, ఒకానొక దశలో తన మాటలతో ప్రాణం పోసిన ఘనత ఈ సిని గేయ రచయితది. అటు సిని సంగీతం అయిన, ఇటు తన సాహితీ ప్రతిభను ఆవిష్కరించినా, ఈ రచయిత తపన, తన మాటలు, భావాలు, సమాజానికి కనీసం మేలు చెయ్యాలని. రచన మీద తనకున్న ఆసక్తే, అటు ఉపాధ్యాయునిగా ఉన్న ఆతనిని, సిని గేయ రచయితని చేసాయి...

‘గులేబకావళి’ కథ (1962) లోని ‘నన్ను దోచుకుందువటే’ పాట నుండి ‘అరుంధతి’ లో ‘జేజమ్మ’ పాట వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఇంతకాలం తెలుగులో గేయ రచయితగా సాగించిన ఆయన మరెవరో కాదు సి. నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు సినారే పేరుతో పాటలు రాసేవారు. 1962 లో ‘ఆత్మ బందువు’ మొదటి చిత్రం చేసిన ఆయన 50 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఆయన తెలుగు భాషలో 3000 పైగా పాటలు రాసారు. ఆయన కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారికి మంచి స్నేహితుడు. అలాగే నారాయణ రెడ్డి గారు మల్లెమాల సుందరరామిరెడ్డి గారితో కూడా చాలా దగ్గరి స్నేహం ఉంది. జూలై 29 1931 లో కరీంనగర్ జిల్లాలో సింగిరెడ్డి నారాయణ రెడ్డిగా జన్మించిన ఆయన తెలుగు భాషపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. 1997 లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన 1992 లో పద్మ భూషణ్ అందుకున్నారు. అలగే విశ్వంభర పుస్తకం రాసినందుకు గాను జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. ఆయన మూడు తరాలకు సాహిత్యం అందించారు.

జులై 29 న, సినారె తన జన్మ దిన వేడుకలని జరుపుకున్నారు... ఈ సందర్భంగా, వంశి బర్కిలీ అవార్డు తో ఈ రచయితకు సత్కారం జరిగింది. ఎందరో మహానుభావులు పాలుగొన్న ఈ వేడుక తెలుగు సిని రచితా లోకానికే గర్వకారణం గా నిలిచింది...

సి.నారాయణరెడ్డి 1931, 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేటలో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి.నారయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలోనీ హరికథలు, జానపదాలు,జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు.తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు.ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడువిశ్వవిద్యాలయము లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. సత్యనారాయణ తరువాత పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ  అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.
సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగా లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

సమయానికి రావడం, తాను చెప్పాలనుకున్న విషయాలు సూటిగా చెప్పటం, సమయానికి విలువనివ్వడం లో సినారె దిట్ట... నేటికి, తెలుగుదనాన్ని ప్రతిమ్బిమ్బించేలా ఉంటుంది సినారె వస్త్రాదరణ.
సమాజం లో ఎటువంటి అభిప్రాయబేధాలు తలెత్తినా, సినారె ఏం అంటారో, ఆయన భావన ఎంతో వినడానికి ఎడుఉచూసేవారు ఎందరో... 'నా కాలానికి ప్రాణం ఉన్నంత వరకు రాస్తాను, రాస్తూనే పోతాను', అనేన్తటి ధైర్యం, రచన పై అంతా ప్రేమ కలిగిన వ్యక్తీ సినారె... అందుకే, డాక్టరేట్ నుండి పద్మవిభూషణ్ వరకు, సినారె అందుకొనే ప్రశంస లేదు... ఈ మహా రచయిత కలం, భావాలు మరెంతో కాలం కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటుంది... ఆంధ్ర విశేష్ .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian cinematographer aloysius vincent
Eega villain sudeep interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles