Ss thamanit is the latest sensation music director

tollywood, celebrity, telugu, cinema, interviews, actors, actress, taman, music director, telugu cinema music

SS Thaman…it is the latest sensation making rounds in the Telugu cinema industry in the form musi .. - Latest tollywood celebrity interviews.

SS Thaman_it is the latest sensation.GIF

Posted: 03/28/2012 06:27 PM IST
Ss thamanit is the latest sensation music director

S.S._taman_interview

S.S._Thamanపాటలో బీటుండాలి. బీటులో హీట్ ఉండాలి. ఆ హీట్ యూత్ ని తాకాలి. ఇవన్నీ ఉండాలంటే సంగీత దర్శకుడు తమన్ ఉండాలి. ఇప్పుడు దమ్మున్న స్వరాలకి కేరాఫ్ అడ్రస్ ఈ యువ సంగీత దర్శకుడు. అయితే ఈ రోజు ఉన్న ఆదరణా అవకాలూ ఒక్క రోజులో వచ్చినవి కాదు. వీటి వెనుక ఎన్నో రోజుల కష్టం ఉంది. ఆ కష్టాలను ఓ సారి మనతో నెమరువేసుకున్న తమన్.
అందరికీ ఒక వయసొచ్చాక అనిపిస్తుంది. డాక్టర్ అవుదామనో, ఇంజినీర్ చేద్దామనో... నాకలా అనిపించలేదు. చిన్నప్పటి నుండి నా కల ఒక్కటే. అదే ఓ సారి నాన్నకి చెప్పాను. ‘నీకు ఏది అనిపిస్తే అదే చెయ్’ అని నాన్న చెప్పారు. అమ్మ కూడా అదే మాట చెప్పింది. కానీ నా కల నిజమవడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. ఎన్నో కష్టాలు అడ్డు పడ్డాయి. వాటన్నించిటినీ దాటుకొచ్చి ఈ రోజు సంగీత దర్శకుడు తమన్ గా మీ అభిమానాన్ని పొందుతున్నాను. నిజానికి సంగీతం అనేది.... నా రక్తంలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే... ఇంట్లోనే ఉంది.

అదే వాతావరణం...

అమ్మ, నాన్న, చెల్లి... ఇది మా కుటుంబం. నాన్న శివకుమార్. మంచి డ్రమ్మర్. అమ్మ సావిత్రి... గాయని. నాన్నది నెల్లూరు. అమ్మది గుంటూరు. పనిలో భాగంగా చెన్నై వచ్చేశారు. మా పెద్దమ్మగారు కూడా బాగా పాడేవారు. నాన్న ఎంతో మంది సంగీత దర్శకుల దగ్గర పని చేశారు. ఇంట్లో ఎటు చూసినా సంగీత వాతావరణమే ఉండేది. కాబట్టి నాకు నెమ్మదిగా డ్రమ్స్ వాయించడం పై ఆసక్తి కలిగింది. రోజూ స్కూలు నుండి రాగానే ఇంట్లో ఉన్న డ్రమ్స్ ని నాకు వచ్చినట్లు వాచించేవాణ్ని. ఓ సారి అమ్మ పాడుతుంటే... నేను వాయిస్తున్నాను. ఇంతలో నాన్న వచ్చి బాగా వాయిస్తున్నావు. నువ్వు పెద్దయ్యాక మంచి డ్రమ్మర్ అవాలనుకుంటే.... ఇప్పటినుండే సాధన మొదలుపెట్టు. అని ఆ వయసులోనే భవిష్యత్తును నా ఇష్టానికి వదిలేశారు. ఎప్పటికైనా సంగీత దర్శకుణ్ని కావాలన్న బీజం పడింది.

వాళ్ళే స్పూర్తి...

నాన్నకి గుండె పోటు వచ్చి మరణించారు. పెద్ద షాక్.. మా జీవితాల్లో చెప్పలేనంత విషాదం. నాన్నగారు కన్ను మూయడంతో కుటుంబబాధ్యత నా పై పడింది. ఆ తరువాత ‘సాగద పరవైగల్’ గ్రూపులో చేరాను. అది చెన్నైలో ఎంతో పేరున్న ఆర్కెస్ర్టా. దాన్లో డ్రమ్స్ వాయించాను. ఎన్నో వేదికలెక్కాను. రోజుకి ముప్సై రూపాయల జీతం. ఆ సొమ్ముతోనే మా కుటుంబం గడిచేది.  ఆ తరువాత కొన్నాళ్ళకి ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ గారి దగ్గర చేరాను. ఆయనతో కలిసి దాదాపు 3000 స్టేజ్ షోల్లో పాల్గొన్నాను. ఆపై నన్ను ఆదరించింది రాజ్ కోటి గారు. వాళ్ళ దగ్గర డ్రమ్స్ ప్లేయర్ గా చేరాను. అప్పటికి కోటి గారి దగ్గర ఎ.ఆర్. రహమాన్, మణిశర్మ, హ్యారిస్ జై రాజ్ శిష్యరికం చేస్తున్నారు. వాళ్లలో నేను ఒక్కడినయ్యాను. కానీ నిజానికి నేను ఏది నేర్చుకున్నా సొంతంగానే. ‘రోజా’ సినిమాతో రహమాన్ సంగీత దర్శకుడు అయ్యాడు. ఆ సందర్భంలో వాళ్లెంత సంతోష పడ్డారో తెలియదు కానీ... వాళ్లని చూసి నేను మాత్రం ఎంతో సంబరపడిపోయే వాణ్ని. ‘మనకీ ఓ రోజు వస్తుంది’ వాళ్ళలా నేనూ... అనుకొని ఆశాభావంతో కలలు కంటూ మురిసిపోతూ ఉండేవాణ్ని.

నటన....

నా జీవితంలో ముఖ్యమైన దశ. మరచిపోలేని అనుభవాలు. ఆనందంగా గడిపిన క్షణాలు. ఇవన్నీ మణిశర్మ గారి దగ్గర పనిచేసినప్పుడే. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాను. దాదాపు 70 సినిమాలకు పని చేశాను. ‘ఒక్కడు’ నుండి బిల్లా’ వరకు ఆయన దగ్గరే ఉన్నాను. ఇక, పోకిరి వంటి సినిమాలకు పనిచేసిన అనుభవం మరచిపోలేనిది. దేవి శ్రీ ప్రసాద్, హ్యారీస్ జై రాజ్ దగ్గర కూడా కొన్నాళ్ళు పని చేశాను. అప్పటి వరకూ నాకు కేవలం డ్రమ్స్ వాయించడం మాత్రమే తెలుసు. కీబోర్డు వాయించడం తెలియదు కానీ... అప్పుడే నేర్చుకున్నాను. ‘ఒక్కడు’ వచ్చిన టైంలో దర్శకుడు శంకర్ గారూ... ‘బాయ్స్’ సినిమా తీశారు. అందులో డ్రమ్స్ వాయించడం తెలిసిన ఒకబ్బాయి కోసం ఆయన వెతుకుతున్నారని తెలిసింది. శంకర్ గారి బంధువొకాయన నన్ను చూసి కాస్త లావుగా బొద్దుగా ఉన్నానని మేకప్ టెస్ట్ చేశారు. శంకర్ సినిమాలో అవకాశం అంటే ఎవరు వదులుకుంటారు. అలా బాయ్స్ సినిమాలో నటించాను. ఆ ఏడాదంతా సంగీతం వదిలేశాను. తరువాత నటుడిగా కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ వద్దనుకున్నాను. తరువాత సంగీత దర్శకుడిగా తమిళంలోనే నా కెరీర్ ప్రారంభం అయింది.  ‘సింధనై సెయ్’, ‘ఈరం’ (తెలుగులో వైశాలి) ‘కావేరీ’ వంటి చిత్రాలకు సంగీతం అందించాను. మహేష్ బాబు చిత్రం ‘అతిథి’ కోసం మణిశర్మ గారు ట్యూన్స్ కడుతున్న రోజులవి. అప్పటికి ఆయన దగ్గరే సురేందర్ రెడ్డి వచ్చి మామూలుగానే ‘ఏం సాయి ఎలా ఉన్నావ్’ అని పలకరించారు. నన్ను అందరూ సాయి అని పిలుస్తుంటారు. తమిళంలో నేను చేసిన పాటల్ని విన్నారట. కాసేపు వాటి గురించి మాట్లాడి ‘కిక్’ సినిమా కథ చెప్పారు. అంతా అయిపోయాక చాలా సింపుల్ గా ఈ సినిమాకి నువ్వే సంగీతం సమకూర్చాలి అని వెళ్లి పోయారు. నా జీవితంలో ‘కిక్’ నిజంగానే కిక్ ఇచ్చింది. ఆ సినిమా సంగీతం పరంగానూ సూపర్ హిట్ అయింది. కిక్ లేకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేవాణ్ని కాదు.  ఆ తరువాత శంఖం, ఆంజనేయులు, జయూభవల్లో అవకాశాలు వచ్చాయి.

కిక్ మీద కిక్కు...

ఆ తరువాత ‘బ్రుందావనం’లో దిల్ రాజు గారు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం నన్ను ఊహించని స్థాయికి తీసుకెళ్ళింది. దాంతో నా సంగీతానికి ఒక ప్రత్యేక ముద్ర పడింది. శ్రీను వైట్ల ఓసారి రెండు సందర్భాలు చెప్పారు. ‘ఒకటి హీరో పరిచయం గీతం’..., రెండోది లవ్ సాంగ్ ‘ ఈ రెండూ నాకు వీలైనంత త్వరగా చెయ్’ అని చెప్పి.. ఇవి ఎవరి కోసం అనుకుంటున్నామ్ అని షాక్ ఇచ్చారు. ‘మహేష్ బాబుతో ‘దూకుడు’ సినిమా చేస్తున్నాను. దానికోసం అన్నారు. నమ్ముతారో నమ్మరో కానీ, నేనైతే ఎగిరి గంతేశాను. రెండు, మూడు రోజుల్లో ఆ పాటలు రెడీ చేశాను. అవే ‘నీ దూకుడు..., ‘గురువారం మార్చి ఒకటి’ ఈ రెండూ మహేష్ బాబు విని సాయినే ఫిక్స్ చేయండన్నారు.
‘దూకుడు’ రికార్డింగ్ ముంబైలో జరుగుతుంది. అక్కడ పూరి జగన్నాథ్ గారిని కలిశాను. ‘సాయి... మహేష్ బాబుతో బిజినెస్ మెన్’ చేస్తున్నాను. ఇప్పటికైనా నాకు ఛాన్స్ ఇస్తావా’ అని అడిగారు. ఆయన ఎందుకలా అడిగారంటే... ‘బుజ్జిగాడు’ సినిమాకి నన్ను సంగీత దర్శకత్వం చేయమన్నారు. కానీ అప్పటికీ నాకు ధైర్యం చాలక వెనక్కి తగ్గాను. ఇప్పుడు బిజినెస్ మెన్ అనేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. మహేష్ బాబుతో మరో ఆఫర్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ తరువాత వెంకటేష్ గారితో ‘బాడీగార్డ్’ రావటం కూడా నా లక్కే.

సినిమా అంటే నాకు మమకారం. సినిమా అంటే ప్రాణం. నాకే కాదు ఎవరికైనా ఇష్టమైన పనిచేస్తున్నప్పుడు అది ఎంత కష్టమైనా అలసటా ఆయాసమూ ఉండవు. నా విజయ రహస్యం కూడా అదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy days hero varun sandesh
Ayurveda maharshi dr elchuri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles