Mulayam singakhilesh yadav

Father, son and politics: Mulayam Singh Yadav-Akhilesh Yadav, Parkash Singh Badal-Sukhbir Singh Badal

Father & son pairs came up winners in UP & Punjab polls. UP's Son No. 1 is CMto-be, Punjab's is de facto CM. ET on Sunday runs a SWOT on the Yadavs and the Badals The Yadavs WHERE FROM? Long.

Mulayam sing_Akhilesh yadav.GIF

Posted: 03/13/2012 12:46 PM IST
Mulayam singakhilesh yadav

Mulayam_sing_Akhilesh_yadav2

 

Mulayam_sing_Akhilesh_yadav

ఉక్కు మనిషి ములాయం సింగ్‌....

సోషలిస్టు, రైతు బిడ్డ, ఉక్కు మనిషి...ఇలా ఆయన పేరుకు ముందు ఎన్నో విశేషణాలను చేర్చవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో చరిత్రను తిరగరాసిన ఘనతకు ఆయనకు దక్కింది. ఆయనే సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌. ఎన్నికల వ్యాకరణాన్ని తిరగరాసేందుకు పుట్టిన వ్యక్తిగా ములాయంను కీర్తించే వాళ్ళున్నారు. మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, ములాయంను ‘లిటిల్‌ నెపోలియన్‌’గా అభివర్ణించారు. చూసేందుకు లావుగా, పల్లెటూరు రైతుగా కన్పించే ములాయం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి, ఇతర పార్టీలకూ కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. ములాయం సింగ్‌ పాలనను ఒకప్పుడు విపక్షాలు ‘గూండారాజ్‌’గా అభివర్ణించాయి. ఆ మచ్చ ను తుడిపేసేందుకు ఇప్పుడు ఆయన కొడుకుని సీఎం చేశాడు.. ఇన్నేళ్ళుగా అధి కారానికి దూరంగా ఉన్నప్పటికీ చెక్కు చెదరని ధైర్యంతో తిరిగి అధికారం దక్కించుకోగలి గారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించారు. పార్టీ వ్యవహారాల్లో యువతకు పెద్దపీట వేశారు. కుమారుడిని రంగంలోకి దించి రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించారు.

ఆధునికతను ఆయన ఒకప్పుడు వ్యతిరేకించినా ఆ తరువాత దానికే పట్టం కట్టారు. ఇటీవలి మేని ఫెస్టోలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లను ఉచిత వరాల్లో ప్రస్తావించారు. తాను కులమతాలకు అతీతమని, లౌకికవాదినని ములాయం సింగ్‌ పలు సంద ర్భాల్లో స్పష్టం చేశారు. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో లౌకికవాద పరిరక్షకుడంటూ ఒకప్పుడు కాంగ్రెస్‌ అధినేతలు ఆయనకు కితాబునిచ్చారు. ఈ లిటిల్‌ నెపోలియన్‌ గురించి ఓ సందర్భంలో రాజీవ్‌గాంధీ ఇలా అన్నారని చెబుతారు.‘‘డ్విట్‌ డి ఇసెన్‌హొవర్‌ (అమెరికా 34వ అధ్యక్షుడు, 1953-61), ఫీల్డ్‌ మార్షల్‌ రోమెల్‌ (జర్మనీ సైనికాధికారి) ఇద్దరూ ఒక్కటైతే ఆ రూపమే ములాయం. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాటిని తీసుకోవడంలో ఇసెన్‌హొవర్‌లా వ్యవహరిస్తారు. వ్యూహనైపుణ్యాల్లో రోమెల్‌ మాదిరిగా ఉంటారు. అనుచరులను ఎంచుకోవడంలో అద్భుత ప్రతిభ ను ప్రదర్శిస్తారు. తనకు ఉపయోగపడే, తన కార్యక్రమాలను అమలుపర్చుకునే వారిని ఎంచుకుంటారు. భారీ రాజకీయ ప్రదర్శనలను చక్కగా నిర్వహించగలరు. ఆ విషయంలో మంచి ఆర్గనైజర్‌, కమాండర్‌. వనరులను చక్కగా వినియోగించుకోగల మేనేజర్‌. వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్ట. దక్షిణాసియా రాజకీయా ల్లోనే అరుదైన నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి. మతతత్వ శక్తులను ఓడించడంలో క్రియాశీలక పాత్ర వహిస్తారు’’ అంటూ రాజీవ్‌ ములాయం సింగ్‌ను ప్రశంసించడం విశేషం. ములాయం సింగ్‌ రాజకీయ నాయ కుడి వేషధారణలో ఉన్న సైనికాధికారిగా రాజీవ్‌ భావించారు.

ములాయం సింగ్‌ది అసాధారణ జ్ఞాపక శక్తి. రాష్ట్రంలోని ప్రతి పల్లె కూడా ఆయనకు సుపరిచితమే. ఆ జ్ఞాపకశక్తికి ఆయన ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతుంటారు. గొంతు లేని వారి గొంతుకగా ఆయన తన రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. హెన్రీ, మార్క్‌‌, లోహియాల సోషలిజాన్ని కల గలపి తనదైన సామాజిక వాదాన్ని రూపొందించారు. లౌకికవాదాన్ని విశ్వసించా రు. అందుకే ముస్లింలకు ఆరాధ్య నాయకుడయ్యారు. లక్షలాది ముస్లింలు ఆయనకు తమ రక్షకుడిగా భావిస్తుంటారు. మల్లయోధుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన ములాయం మల్లయుద్ధంలో నేర్చుకున్న పట్టువిడుపులను పాలిటిక్స్‌ లో ప్రదర్శిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎదుగుదల గాలివాటంగా వచ్చింది కాదు. తాజా ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. మైనారిటీల, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ఆశాకిరణంగా ఆయన వెలుగొందారు. అదే ఇప్పుడు ఆయనకు పట్టం కట్టింది. ఎమర్జెన్సీ కాలంలో మొక్కవోని ధైర్యంతో, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆయన 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం నినాదాలు నేటికీ ధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో అవి ప్రతిధ్వనించాయి. తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనను రాజీవ్‌గాంధీ, తన సొంత పార్టీ వారి కన్నా అధికంగా విశ్వసించారని చెబుతారు. పేదల రాజకీయాలను ములాయం అనుసరించారు.అందుకే అగ్రవర్ణాల పేదలూ ఆయన వెంట నడిచారు. బీసీలూ, దళితులూ అండగా నిలిచారు. రాజ్యాధికారం కట్టబెట్టారు. దటీజ్‌ ములాయం!

పూర్తి పేరు         : ములాయం సింగ్‌ యాదవ్‌Akhilesh_mulayam
పుట్టిన రోజు        : 1939 నవంబర్‌ 22
వయసు          : 72
జన్మస్థలం         :  సైఫాయ్‌, ఇటావా, ఉత్తరప్రదేశ్‌
భార్య              : సాధనా గుప్తా, మాలతీ దేవీ(మెుదటి భార్య)
సంతానం          : అఖిలేష్‌ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌
నివాసం           :  సైఫాయ్‌, ఇటావా, ఉత్తర్‌ప్రదేశ్‌
పార్టీ               : సమాజ్‌ వాదీ పార్టీ
రాజకీయ అస్తిత్వం     :  ఉత్తర్‌ప్రదేశ్‌
చేపట్టిన పదవి        :  ముఖ్యమంత్రి (మూడుసార్లు)
రక్షణ మంత్రిగా        : 1996 జూన్‌ నుంచి 1998 మార్చి వరకు
తొలి రాజకీయ పదవి    : రాష్ట్ర మంత్రి (1977)
తొలికీలక పదవి       : లోక్‌దళ్‌ పార్టీకి అధ్యక్షుడు (1980)
ప్రతి పక్షనాయకుడిగా    :1982లో 
పార్టీ స్థాపన          :1992లో ( సమాజ్‌ వాదీ పార్టీ)
తొలి సారి ముఖ్యమంత్రిగా  : 1989లో (జనతాదళ్‌ )
రెండవ సారి          : 1993లో ( సమాజ్‌ వాదీ పార్టీ తరపున)
మూడవ సారి         : 2003లో  (సమాజ్‌ వాదీ పార్టీ తరపున)
కేంద్ర మంత్రిగా         : దేశ రక్షణ మంత్రిగా 1996లో 
వివాదాలు            : 1990లో అయోధ్య ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు,
                       ప్రత్యేక ఉత్తరాఖండ్గ ఉద్యమాలకు మద్దతునివ్వడం.
రికార్డు               : 183,899 మెజారిటీతో శాసనసభ ఎన్నికలలో విజయంయువతరంగం

అఖిలేష్‌ యాదవ్‌…

ఇంజినీరింగ్‌ చదివిన అఖిలేష్‌ భవనాలను నిర్మించడం మానేసి సమాజాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు. ములాయం కుమారుడిగా లభించే గుర్తింపు కన్నా మిన్నగా తన సొంత ఇమేజ్‌ను రూపుదిద్దుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. తండ్రి తనపై పెట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో పోలిస్తే ఆయన కంటే మరింత సమర్థంగా అఖిలేష్‌ వ్యవహారాలు నెట్టుకురాగలిగారు. 2000లో ఉప ఎన్నికలో లోక్‌సభకు ఎన్నికైన అఖిలేష్‌ అనతికాలంలోనే రాజకీయాలను ఒంటబట్టించుకోగలిగారు. 200 4, 2009 ఎన్నికల్లోనూ ఆయన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి కూడా అఖిలేష్‌ పార్టీపై తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ‘గూండారాజ్‌’ అంటూ తండ్రి పాలనపై పడిన ముద్రను చెరిపి వేసేందుకు  ఆయన ఎంతగానో ప్రయత్నించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో అభ్యర్థుల  జాబితాను ప్రదర్శిస్తూ ఇందులో గూండా లెవరైనా ఉంటే ఇప్పుడే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామంటూ ధైర్యంగా ప్రకటించారు.

రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన తరువాత, ఎన్నికల సందర్భంగా మేనిఫె స్టోలో ప్రజలకు చేసిన వాగ్దానాలను అన్నిం టినీ నెరవేరుస్తామని అఖిలేష్‌ చెబుతున్నారు. ఆయన వ్యవహారశైలి తెలిసిన వారంతా కూడా ఆయన అనుకున్నది సాధిస్తారనే అంటున్నారు. వాస్తవానికి సమాజ్‌వాదీ పార్టీ గెలిస్తే అఖిలేష్‌ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా ఒక దశలో సాగింది. అందుకు తగ్గట్లుగానే జరిగింది. తన తండ్రికి తన బహుమతిగా సీఎం పీఠాన్ని అందించేందుకు ఇష్టపడ్డా, ములాయం దాన్ని కొడుకు చేతిలో పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌ ను పునర్‌నిర్మిస్తామని అఖిలేష్‌ అంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీపై నమ్మకాన్ని వ్యక్తం చేసి నందుకు ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలి పారు. ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో ఆయనకు తెలిసిందే. ఒకప్పుడు తండ్రి హయాంలో నెలకొన్న ‘గూండారాజ్‌’ను ప్రజలు ఆ తరువాత ఎలా తిరస్కరించారో అఖిలేష్‌ గ్రహించారు. అందుకే ఇప్పుడు ఆయన ‘గూండారాజ్‌’కు వ్యతి రేకంగా మాట్లాడుతున్నారు.సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో ఇక ఎలాంటి ‘గూండారాజ్‌’ను సహించబోదని స్పష్టం చేశారు. అది ఆయన సొంత పార్టీలోని వారికీ ఓ హెచ్చరికగా మారింది. గూండాలంతా అకస్మాత్తుగా మంచి వారైపోతే ఎలా ఉంటుంది? అది చూడాలంటే మరికొద్ది రోజులు ఓపిక పడితే చాలు. అఖిలేష్‌ ఆ గూండాలను మారుస్తారా లేదా వారే అఖిలేష్‌నూ తమలో చేర్చుకుంటారా అనే విషయం తేలిపోతుంది. మాయా వతి హయాంలో ఇన్నాళ్లూ అరాచకాలు సాగాయని, వాటికి చరమగీతం పాడుతామని అఖిలేష్‌ హెచ్చరించారు. ఒక విధమైన ప్రతీకార ధ్వని కూడా ఇందులో గోచరిస్తోంది.

పూర్తి పేరు      : అఖిలేష్‌ యాదవ్‌
పుట్టిన రోజు      :  1973 జులై 1Akhilesh
వయసు        : 39
జన్మస్థలం       : సైఫాయ్‌, ఇటావా, ఉత్తరప్రదేశ్‌
తండ్రి          : ములాయం సింగ్‌ యాదవ్‌
పార్టీ           :  సమాజ్‌వాదీ పార్టీ
పార్టీ ెదా        : ఉత్తర ప్రదేశ్‌ సమాజ్‌ వాదీ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు
సంతానం        : అదితి, టినా, అర్జున్‌ యాదవ్‌
నివాసం         :  సైఫాయ్‌, ఇటావా, ఉత్తర్‌ప్రదేశ్‌
మతం          : హిందూ
విద్యాభ్యాసం      : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌
కళాశాల         : శ్రీ జయచమా రాజేంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, మైసూర్‌ విశ్వవిద్యాలయం
ప్రస్తుతం హోదా    : లోక్‌సభ సభ్యుడు
నియోజక వర్గం     : కనౌజ్‌, ఉత్తర ప్రదేశ్‌
లోక్‌ సభకు తొలిసారి   : 2000 ఉపఎన్నికలో
రాజకీయ చరితం    : నాలుగు సార్లు లోక్‌ సభకు ఎన్నికవడం
ప్రస్తుత హోదా     : లోక్‌ సభ సభ్యుడు
నియోజక వర్గం     : కనౌజ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayurveda maharshi dr elchuri
Istory of holi festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles