Kcr tollywood condolance chakri death

chakri death, music director chakri died, kcr on chakri death, tollywood on chakri death, chakri death latest updates, tollywood latest news updates, chakri movies songs

kcr tollywood condolance chakri death : telangana chief minister kcr condolance to chakri death and tollywood industry personalities also condolance on music director death

సంగీత దర్శకుడు చక్రి మృతిపై ప్రముఖుల విచారం

Posted: 12/15/2014 09:29 AM IST
Kcr tollywood condolance chakri death

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. చక్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి ఆయనమరణం తీరని లోటన్నారు. తెలంగాణ బిడ్డ ఎన్నో విజయాలు సాధించాడని కొనియాడారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు సంగీతం అందించాడనిగుర్తు చేసుకున్నారు. అటు పలువురు సినీ ప్రముఖులు కూడా చక్రి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.


చక్రి (40) అలియాస్ చక్రధర్ గిల్ల ఇక లేరు. గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున  తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చక్రికి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తీసుకెళ్ళారు.ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ కు చెందిన చక్రి పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ‘బాచి’ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్

ప్రారంభించారు. ‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘దేశ ముదురు’, ‘సత్యం’, ‘గోపి గోపిక గోదావరి’, ‘సింహ’ వంటి సినిమాలకు సంగీతం అందించారు. కెరీర్లో 85 సినిమాలకు  సంగీత దర్శకుడిగా పనిచేశారు. ‘సింహ’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. చివరగా సంగీతం అందించిన ‘రేయ్’ సినిమా విడుదల కావాల్సి ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : music director chakri death  kcr on chakri death  chakri telugu songs  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more