70 percent polling recorded in jammu and kashmir

jammu kashmir elections, first phase elections, 70 percent polling, Abdul Gaffar, Abdul Majid, Bandipore, Congress, Election, Election Commission, Kargil, Ladakh, National Conference

70 percent polling recorded in jammu and kashmir

అనూహ్య స్పందన, జమ్మూలో 70 శాతం పోలింగ్

Posted: 11/25/2014 09:15 PM IST
70 percent polling recorded in jammu and kashmir

ఉత్తర కాశ్మీర్లో రెండుచోట్ల బాంబులు పేలినా వెరవకుండా, వెనక్కు తిరిగి ఇళ్లకు పోకుండా అక్కడి ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. అంచనాలకు మించి తొలిధశ మునుపెన్నడూ లేనంతగా  పోలింగ్ లో పాల్గొన్నారు.. అయినా, తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ దాటింది. తొలి విడతలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఈ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70% పోలింగ్ రికార్డయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో అయితే కనిష్ఠంగా కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ స్థితి నుంచి క్రమంగా బయటపడి.. ఇప్పుడు 70% పోలింగ్ నమోదుచేసే స్థితికి జమ్ము కాశ్మీర్ చేరుకుంది.

ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు సహా మొత్తం 132 మంది అభ్యర్థులు తొలిదశలో పోటీపడ్డారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం చలి కారణంగా పోలింగ్ కొంత మందగించినా, మధ్యాహ్నానికి బాగా పుంజుకుంది. బండిపురా ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రం బయట బాంబు పేలింది. అలాగే ఇదే ప్రాంతంలో మరోచోట కూడా మధ్యాహ్నం ఇంకో బాంబు పేలింది. అయినా.. ఓటర్లు మాత్రం చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఓట్లు వేసేందుకు ముందుకొచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more