Shamshabad international airport came because of us only says andhra pradesh chief minister chandrababu

shamshabad airport, domestic terminal, international airport, ntr name, TDP, chandrababu, Andhra pradesh, chief minister

shamshabad international airport came because of us only says Andhra pradesh chief minister chandrababu

మా వల్లే అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది..

Posted: 11/22/2014 04:39 PM IST
Shamshabad international airport came because of us only says andhra pradesh chief minister chandrababu

శంషాబాద్ విమానాశ్రయం టీడీపీ వల్లే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తామేనని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం అర్ధరహితమన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానేతకు కూడా ప్రాంతీయ తత్వాలను అంటగట్టడం సహేతుకం కాదన్నారు, తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన ఎన్టీయార్ లాంటి గోప్ప వ్యక్తిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు మార్చే అవకాశం ఉన్నా  సంప్రదాయాన్ని అనుసరించి పేరు మార్చలేదని గుర్తు చేశారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెడతామని 2009లోనే చెప్పామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న నేతలు ఎన్టీఆర్ వల్లే రాజకీయాల్లోకి పైకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. పేదవారి హక్కుల్ని కాపాడింది ఎన్టీఆరేనని ప్రశంసించారు. కేసీఆర్, జానారెడ్డిలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని చంద్రబాబు అన్నారు. నూతన రాజధానిలో కొమురం భీం, చాకలి అయిలమ్మ, పీవీ నరసింహారావు పేర్లు గుర్తిండిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ శాసనసభలో టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టొద్దంటూ తీర్మానం చేసి తెలుగు ప్రజలను అవమానించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన... ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more