Punjab and haryana hc cancels godman rampal s bail in 2006 murder case

Punjab and Haryana High Court, reject, godman Rampal, bail, 2006 murder case, Barwala, two week tension, hostage, army, Satlok Ashram, Panchkula town, Chandigarh, medical examination

punjab and Haryana HC cancels godman Rampal's bail in 2006 murder case

రాంపాల్ బెయిల్ ను రద్దు చేసిన హైకోర్టు..

Posted: 11/20/2014 01:07 PM IST
Punjab and haryana hc cancels godman rampal s bail in 2006 murder case

రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు సంత్‌రాంపాల్‌ బెయిల్‌ను హర్యానా హైకోర్టు రద్దు చేసింది. ఆయనను తక్షణం కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ మధ్యాహ్నం ఆయనను కోర్టులో హజారపర్చాలని పోలీసులను ఆదేశించింది. 2006 నాటి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాంపాల్‌ అప్పట్లో బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చారు. ఆ తరువాత ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. 43 సార్లు కోర్టు ఆదేశాలను రాంపాల్‌ బేఖాతరు చేశాడు. దీంతో ఆయన బెయిల్ ను న్యాయమూర్తులు జస్టిస్ జయపాల్, జస్టిస్ దర్శన్ సింగ్ నేతృత్వంలోని హైకోర్టు ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది.
 
హిస్సర్‌ జిల్లా బర్వానాలోని ఆశ్రమం వద్ద రాంపాల్‌ను అరెస్ట్‌ చేయాలని పోలీసుల ప్రయత్నాలను గత రెండు వారాలుగా తన అనుచరులతో అడ్డుకోవడంతో హిస్సార్ లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. తన అనుచరులపై పోలీసులపై దాడి చేయించిన రాంపాల్‌ మీద దేశద్రోహం కేసును నమోదు చేశారు. రాంపాల్‌ ఆశ్రమాన్ని ఛేదించిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి కట్టుదిట్టమైన భద్రతల మద్య చంఢీగడ్ సమీపంలోని పంచకుల పట్టణానికి తీసుకోచ్చారు. ఈ ఉదయం పంచకులలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రాంపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపాల్ మాట్లాడుతూ తనపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చారు. తాను ఎవరినీ తన సత్ రామ్ ఆశ్రమంలో బందించలేదని, ఎలాంటి సైన్యాన్ని ఏర్పాటు చేయలదేని చెప్పారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more