Bombay high court rejects cbis plea to drop ashok chavan name

bombay high court, reject, cbi plea, ashok chavan name, Adarsh Housing society, stayed, efforts, withdrawal, charges efforts

bombay high court rejects cbis plea to drop ashok chavan name

చవాన్కు ఎదురుదెబ్బ.. సీబీఐ వినతిని తోసిపుచ్చిన హైకోర్టు

Posted: 11/19/2014 04:07 PM IST
Bombay high court rejects cbis plea to drop ashok chavan name

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  అశోక్ చవాన్కు బోంభే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదర్శ్‌ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అభియోగాల ఉపసంహరణ చర్యలపై ముంబయి హైకోర్టు స్టే విధించింది.

కాగా అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం  నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్ను పేర్కొంది.   ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. దీంతో ఆయనతో పాటు 13 మందిపై కోర్టు విచారణ సాగుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more