Telangana and unorganized workers development is my first priority says bandaru dattatreya

telangana, development, first priority, bandaru dattatreya, Unorganized workers, 42 crores, skills, Labor protection laws, strengthened, Employment oppurtunities

telangana and Unorganized workers development is my first priority says bandaru dattatreya

తెలంగాణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం..

Posted: 11/16/2014 08:22 PM IST
Telangana and unorganized workers development is my first priority says bandaru dattatreya

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికే తాను మొదటి ప్రాధాన్యమిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శ్రమయేవ జయతే పథకంతో కార్మికులకు న్యాయం చేస్తామని, కార్మికుల సంక్షేమ పథకాలు నేరుగా అందించే ప్రయత్నం చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. అలాగే అసంఘటిత కార్మికుల సంక్షేమంపైనే తన దృష్టంతా వుందన్నారు. రాష్ట్ర గవర్నరు నరసింహన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 42 కోట్ల మంది అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని, వారిలో నైపుణ్యాలు పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. కార్మికుల రక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలుచేస్తామన్నారు.

పారిశ్రామిక రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించాల్సి ఉందని, పరిశ్రమలు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. నిపుణులైన కార్మికులు అవసరమని ఆస్ట్రేలియా కోరిందని, అక్కడ గని కార్మికులు పెద్ద సంఖ్యలో కావాలని ఆయన చెప్పారు. పిల్లల్లో చిన్న నాటినుంచే వృత్తివిద్యను బోధించాలని, అప్పుడే నిపుణులు తయారవుతారని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. మెట్రో రైలు తన కలల ప్రాజెక్ట్ అని అన్నారు. తెలంగాణలో బీడీ కార్మికుల గృహనిర్మాణానికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని దత్తాత్రేయ చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more