A family collapses their house for killing snake

king kobra snakes life time, king kobra bites, king kobra poison power, king kobra snakes latest news, snakes in house, friends for snakes society volunteers, nalgonda district news, nalgonda latest news, house collapses

a family collapses their house for killing snake : a family in nalgonda district collapses their house for killing a kingkobra snake. with kingkobra a family faced so many problems than the family collapses house for kill it.

కొంప కొల్లేరు చేసిన నాగుపాము

Posted: 11/15/2014 03:34 PM IST
A family collapses their house for killing snake

ప్రజల దృష్టిలో నాగుపాము పుట్టలో ఉంటే దైవం. అదే ఇంటికి వస్తే మాత్రం భయంతో వణికిపోతారు. సరిగ్గా నల్గొండ జిల్లాలోని ఓ కుటుంబం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కుంది. తుర్కపల్లి మండలం ముల్కపల్లికి చెందిన గుండెబోయిన చంద్రయ్య, మంజుల దంపతుల పెంకుటింట్లోకి ఓ నాగుపాము వచ్చింది. ఇంటి గొడలు, ఇతర ప్రాంతాల్లో ఉండే ఎలుకల్ని తింటూ ఏకంగా ఇంట్లోనే తిష్ట వేసింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇంట్లో పాము తిరగటం మొదలు పెట్టింది.

ఇలా పాము ఇంట్లో తిరుగుతుండటంతో చంద్రయ్య కుటుంబం తీవ్ర భయాందోళనకు గురయింది. ఇంటి గోడలపైన, కర్రలపైన ఇలా ఎక్కడ పాము కన్పించినా ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోయేవారు. చిన్న శబ్దం అయినా సరే భయంతో వెంటనే లేచేవారు. ఇలా రోజూ పాము వేధింపులతో విసిగిపోయిన కుటుంబం.., ఇంటిని కూల్చేస్తేనే పాము బయటకు వెళ్తుందని నిర్ణయానికి వచ్చారు.

అనుకున్నట్లుగానే కప్పు, చెక్కలతో సహా ఇళ్ళు మొత్తం కూల్చేశారు. ఇల్లు కూల్చేయటంతో ఎలుకలన్నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాయి. దీంతో నాగు పాముకు ఆహారం లేకుండా పోయింది. ఇక మరొక ప్రాంతానికి వెళ్దామని గోడపైనుంచి పాము కిందకు పడింది. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న స్థానికులు పామును కొట్టి చంపారు. దీంతో చంద్రయ్య కుటుంబం ఊపిరిపీల్చుకుంది. అయితే పాము కోసం ఇళ్ళు పూర్తిగా కూలగొట్టాల్సి రావటంతో వారు ఇప్పుడు మరొక ఇంట్లో ఉంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : king kobra  house collapse  nalgonda  latet news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more