Che guevara death time photos revealed by a spain soldier nephew

che guevara death photos, che guevara death time photos in spain, spain army soldier photos of che guevara, che guevara life biography, che guevara latest news, world latest news, che guevara in india tour photos, spain latest news updates, bolivia news, cuba latest news updates

che guevara death time photos revealed by a spain soldier nephew : after 47years of che guevara death in 1967 a spain family reveals his photos. a spain soldier nephew named imanol arteaga says his uncle given had kept che photos with him as they came from bolivia to spain

బయటపడ్డ చెగువేరా మృతదేహ ఫొటోలు

Posted: 11/15/2014 01:31 PM IST
Che guevara death time photos revealed by a spain soldier nephew

విప్లవయోధుడు చెగువేరా చనిపోయిన సమయంలో తీసిన పొటోలు అనూహ్యంగా స్పెయిన్ లో బయట పడ్డాయి. ప్రస్తుతం ఈ ఫొటోలో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. బొలివియా సైన్యం 1967 అక్టోబర్ 9న ఛే ను కాల్చి చంపిందన్న విషయం తెలిసిందే. బొలివియా సైన్యంలో పనిచేసే ఓ సైనికుడి మేనల్లుడు ఇమానోల్ అర్టెగా ఈ ఫోటోలను బయట పెట్టాడు. తన మామయ్య 1960 సమయంలో బొలివియా సైన్యంలో పనిచేసాడని ఆయన చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత తమ వద్దకు వచ్చి దాదాపు 47సం.లు ఉన్న మామయ్య ఫొటోలను తమవద్దే ఉంచాడని చెప్పారు.

che-guevara-death-photos-2

తన మామయ్యకు ఈ ఫొటోలు ఓ ఫ్రెంచి జర్నలిస్టు ఇచ్చాడని మీడియా సంస్థతో అర్టిగా వెల్లడించాడు. బహుశా ఫొటో జర్నలిస్టుకు ఈ ఫొటోల వల్ల ఇబ్బంది కలుగుతుందని భయపడి తన మామయ్యకు ఇచ్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. బొలివియాలో చనిపోయిన చెగువేరా ఫొటోలు నలబై ఏడు సంవత్సరాల తర్వాత స్పెయిన్ లోని ఒక చిన్న పట్టణంలో బయట పడటం సంచలనం కల్గిస్తోంది. చనిపోయిన సమయంలో తీసిన ఫొటోల్లో మాసిన గడ్డంతో పాటు, గర్జించే కళ్ళు.., చనిపోయినా తెరిచే ఉన్నాయి. గుండెపై రక్తపు మరకలు కన్పిస్తున్నాయి. అప్పట్లో అందుబాటులో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టెక్నాలజీతో  ఈ ఫొటోలు తీశారు.

che-guevara-death-photos-3

ఛే గురించి క్లుప్తంగా

1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చేగువేరా క్యూబా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని విప్లవ యోధుడుగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. మెడిసిన్ చదివిన చెగువేరా.., విద్యార్థిగా ఉండగానే వివిధ దేశాల్లోని అనేక ప్రాంతాల్లో పర్యటించాడు. లాటిన్ అమెరికా దేశాల్లో ఆకలి, దారిద్ర్యంను చూసి చలించిపోయాడు. అక్కడి ఉద్యమకారులతో చేతులు కలిపి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫిడెల్ క్యాస్ర్టోతో కలిసి గెరిల్లా దండు నడిపి క్యూబాలో విప్లవం సృష్టించాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యూబాలోనే అనేక పదవుల్లో కొనసాగాడు. ఆ తర్వాత ఫిడెల్ క్యాస్ర్టో వద్దని వారించినా వినకుండా రహస్యంగా బొలివియాకు వెళ్ళాడు. అక్కడ అజ్ఞాతంలో ఉంటూ ప్రజా పోరాటాలు చేశారు. ఈ సమయంలోనే 1967 అక్టోబర్ 9న బొలివియా సైన్యం చెగువేరాను కాల్చి చంపింది. ఎక్కడో పుట్టి.., ఉన్నత విద్యను అభ్యసించి తనకు ఏ మాత్రం సంబంధం లేని దేశాలకు వెళ్లి వారి కోసం పోరాడి.., జీవితమంతా ప్రజలకోసం అంకితం ఇచ్చిన గొప్ప విప్లవ యోధుడు చెగువేరా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : che guevara  death  photos  spain  latest news  bolivia  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more