Teacher beats student for bringing non vegetarian food as his lunch

lunch, Meat, Teacher beats student, Central bank colony, kakatiya Techno school, vardhaman, HRC, parents

teacher beats student for bringing non vegetarian food as his lunch

లంచ్ లో నాన్ వెజ్ తీసుకువెళ్తే నేరమా..?

Posted: 11/14/2014 09:10 AM IST
Teacher beats student for bringing non vegetarian food as his lunch

పాశ్యాచ మోజులో పడి ఆంగ్లమే సర్వస్వం అంటూ గగ్గోలు పెడుతున్న ప్రసుత్త పాఠశాలలు.. అంగ్లంలో మాట్లాడలేదని విదార్థులను చితకబాదిన ఘటనలు ఎన్నో వున్నాయి. ఫీజు కట్టలేదనో, అయప్ప స్వామి మాల వేశాడనో కొట్టిన ఘటనలు అనేకం వున్నాయి. కాని ఇక్కడ మరో విచిత్రమైన ఘటన చోటచేసుకుంది. చదువుకుంటే వున్న మతి పోయినట్లు.. పిల్లలు తినే బోజనంలో కూడా ఆంక్షలు విధించింది అక్కడి పాఠశాల యాజమాన్యం. విద్యార్థులు మధ్యాహ్నం బోజనంలో మాంసాహారం తీసుకువస్తే కూడా నేరమన్నట్లు వ్యవహరించింది. పిల్లవాడిని కొట్టి హింసించింది.

వివరాల్లోకి వెళ్తే మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం తీసుకువచ్చాడని విద్యార్థిని టీచర్ చితకబాదారు. మన్సూరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని కాకతీయ టెక్నో స్కూల్‌లో అదే ప్రాంతానికి చెందిన వర్థమాన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం టిఫిన్ బాక్సులో మాంసాహారం తీసుకువచ్చినట్లు గమనించిన టీచర్ మాధవి విద్యార్థిని చితకబాదింది. ఎందుకు మాంసాహారాన్ని తీసుకువచ్చివని నిలదీసింది. అమాయకంగా బిక్క ముఖం పెట్టిన విద్యార్థి.. తన తల్లి టిపిన్ బాక్స్ పెడుతుంది. ఏం పెట్టిందో తనకు తెలియదని చెప్పినా వినిపించుకోని టీచర్ తన ప్రతాపాన్ని చూపింది. ఇంటికి వెళ్లిన పిల్లవాడు తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. ఈ విషయమై వారు బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lunch  Meat  Teacher beats student  Central bank colony  kakatiya Techno school  vardhaman  HRC  parents  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more