Comet siding spring showered mars with meteors

comet, mars, NASA ,space, mom, mission on mars, isro, Siding Spring, tiny particles, ice and dust

Comet Siding Spring Showered Mars with Meteors

అద్భుతం.. అంగారకుడి అకాశంలో తారజువ్వలు..

Posted: 11/09/2014 06:44 PM IST
Comet siding spring showered mars with meteors

ఖగోళంలో అద్భత సన్నివేశం.. అంగారక గ్రాహానికి అతి చేరువగా వచ్చిన తోక చుక్క.. సైడింగ్ స్ట్రింగ్ మార్స్ గ్రహానికి అతిచేరువగా వచ్చి హలో చెప్పి వెళ్లిన సంగతి తెలిసిందే. గత నెలలో అంగారకుడి వాతావరణాన్ని రాసుకుంటూ వెళ్లిన తోకచుక్క సైడింగ్ స్ప్రింగ్.. తాజాగా,  అద్భుతమైన తారాజువ్వల్లాంటి వెలుగులను చిమ్మినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తోకచుక్క నుంచి వచ్చిపడ్డ టన్నులకొద్దీ ధూళి అరుణగ్రహ వాతావరణంలో మండిపోవడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు చెప్పారు. ఈ ఖగోళ వస్తువు గతనెల 19న అంగారకుడి ఉపరితలానికి 87వేల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. నాటి పరిణామానికి సంబంధించిన శాస్త్రీయ వివరాలను శాస్త్రవేత్తలు

తాజాగా వెలువరించారు. అయితే వెలుగులు చిమ్మే పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన అంగారక రోవర్లు ఆపర్చ్యునిటీ, క్యూరియాసిటీలు పరిశీలించలేకపోయాయని చెప్పారు. తోకచుక్కను ఆపర్చ్యునిటీ కొన్ని ఫోటోలు తీసిందని తెలిపారు. అరుణగ్రహ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు మాత్రం ఆ గ్రహంపై తోకచుక్క చూపిన ప్రభావాన్ని పరిశీలించాయి. ఆ ఖగోళవస్తువులో మెగ్నీషియం, ఇనుము, సోడియం, పొటాషియం, మ్యాంగనీసు, నికెల్, క్రోమియం, జింక్ వంటి పదార్థాలు ఉన్నట్లు మావెన్ అనే ఉపగ్రహం గుర్తించింది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ కూడా తోకచుక్క.. చూపిన ప్రభావాన్ని అధ్యయనం చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comet  mars  NASA  space  mom  mission on mars  isro  Siding Spring  tiny particles  ice and dust  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more