దేశవాలి క్రికెట్, అండర్ 19 క్రికెట్ పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబర్చి.. దశాబ్దానికిపైగా క్రికెట్ అభిమానులందరికీ సుపరిచితుడైనా ఆ తెలుగుతేజానికి .... ఎప్పుడూ పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా పరిస్థితులతో పోరాడి ఏడాది క్రితం భారత జట్టులోకి వచ్చిన అంబటి రాయుడు... ఎట్టకేలకు తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. శ్రీలంకతో రెండో వన్డేలో సెంచరీ (118 బంతుల్లో 121 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన రహానే (8) ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. అయితే కోహ్లి బదులు.. రాయుడు ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కావలసినన్ని ఓవర్లు అందుబాటులో ఉండటంతో రాయుడు స్వేచ్ఛగా ఆడాడు.
మరోవైపు ధావన్ కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. ఆ తర్వాత ధావన్ అవుటైనా... కోహ్లి, రాయుడు కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి గెలుపును లాంఛనం చేశారు. ప్రసన్నకు 3 వికెట్లు దక్కాయి. ఫలితంగా భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను అలవోకగా ఓడించింది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 274 పరుగులు చేసింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (101 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. సంగక్కర (86 బంతుల్లో 61; 4 ఫోర్లు), దిల్షాన్ (30 బంతుల్లో 35; 7 ఫోర్లు), దమ్మిక ప్రసాద్ (28 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.3 ఓవర్లలో 4 వికెట్లకు 275 పరుగులు చేసింది. ధావన్ (80 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (44 బంతుల్లో 49; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more