Actor sadashiv amrapurkar dies at 64

Actor Sadashiv Amrapurkar, Actor Sadashiv Amrapurkar death, Actor Sadashiv Amrapurkar latest news, bollywood latest news, kokilaben hospital, Actor Sadashiv Amrapurkar movies

Actor Sadashiv Amrapurkar Dies at 64 : ollywood actor Sadashiv Amrapurkar, who was being treated for a lung infection at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, has died. He was 64

ప్రముఖ నటుడు సదాశివ్ కన్నుమూత

Posted: 11/03/2014 09:24 AM IST
Actor sadashiv amrapurkar dies at 64

బాలీవుడ్ ప్రముఖ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సదాశివ్, ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి 2.45కి సదాశివ్ చనిపోయినట్లు ఆయన కుమార్తె రీమా, మీడియాకు వెల్లడించారు. ప్రజల సందర్శనార్ధం భైదాస్ ఆడిటోరియంలో పార్ధివదేహం ఉంచుతామన్నారు. అహ్మద నగర్ లో అంత్యక్రియలు జరుపుతామని కుటుం సభ్యులు తెలిపారు. సదాశివ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరున్న సదాశివ్ అమ్రాపుర్కర్ 'అర్ధ్' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అంఖే, ఇష్క్, కూలీ నెంబర్ 1, గుప్త్ చిత్రాల్లో విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. 'సడక్' తో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  మొదట్లో బాలీవుడ్ లోనే నటించిన సదాశివ్ ఆ తర్వాత క్రమంగా మరాఠీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అర్ధ్ సత్య, సడక్ చిత్రానికి ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2012లో సదాశివ్ సొంతంగా నిర్మించి, నటించిన 'బాంబే టాకీస్' మూవీలో చివరగా తెరపై కనిపించారు. ఆ తర్వాత నటనాజీవితాన్ని తగ్గించుకుంటూ సామజిక సేవలకు ప్రాధాన్యం ఇచ్చారు. పలు స్వచ్చంధ సామాజిక సేవా కార్యక్రమాల్లో సదాశివ్ పాల్గొన్నారు. 64ఏళ్ళ అమ్రాపుర్కర్ కు బార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sadashiv Amrapurkar  death  bollywood  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more