China completes first return mission to moon

Virgin Galactic, spacecraft, crash, photo released, China's Xinhua News Agency, unmanned spacecraft, spacecraft, launch, advanced Long March, 3C rocket, Xichang Satellite Launch Center, Sichuan Province, Moon

China Completes First Return Mission to Moon

చైనాదెట్టా క్షేమంగా తిరిగివచ్చింది... చెప్మా.. అమెరికా ఆరా..

Posted: 11/02/2014 05:15 PM IST
China completes first return mission to moon


అంతరిక్ష ప్రయోగంలో వారం రోజుల్లోనే రెండు చేధు అనుభావాలను చవిచూసిన అగ్రరాజ్యం అమెరికా చైనా విజయపరంపరపై ఆరా తీస్తుందట. రెండువారం కిందట చంద్రునిపైకి వెళ్లిన చైనా మానవరహిత అంతరిక్షనౌక సురక్షితంగా భూమిపై దిగింది. ఉత్తరచైనాలోని మంగోలియా ప్రాంతంలో ఈ అంతరిక్షనౌక దిగినట్లు బీజింగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమి, చంద్రునికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు తీసిందని ఆ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నది.మొత్తం 8 లక్షల 40 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సురక్షితంగా ముగించి.. ఈ ఘనత సాధించిన మూడోదేశంగా చైనా నిలిచింది. 40 ఏండ్ల కిందటే సోవియట్ యూనియన్, అమెరికా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించాయి. ఎనిమిది రోజుల కిందట చంద్రునిపైకి వెళ్లిన ఈ అంతరిక్షనౌక శనివారం ఉదయం భూవాతావరణంలోకి ప్రవేశించింది.

ఆ సమయంలో గంటకు 25 వేల మైళ్ల వేగంతో దూసుకొస్తున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్ వేగాన్ని శాస్త్రవేత్తలు గణనీయంగా తగ్గించి సురక్షితంగా కిందికి దిగేలా చేశారు. చంద్రుని పైకి వెళ్లి, దాని చుట్టూ ఎగిరి, తిరిగి భూమిపైకి వచ్చే లక్ష్యంతో దీన్ని ప్రయోగించినట్లు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ ఫర్ నేషనల్ డిఫెన్స్ (ఎస్‌ఏఎస్‌టీఐఎన్‌డీ) శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రునిపై అన్వేషణలో భాగంగా చైనా ప్రయోగించబోయే చాంగె-5లో వాడాల్సిన టెక్నాలజీని పరీక్షించడానికి ఈ మానవరహిత అంతరిక్షనౌకను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. తమ దేశస్థుడు చంద్రునిపై అడుగుపెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న చైనా.. ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more