ఈసారి మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికలముందే దశాబ్దాల నుంచి కొనసాగుతూ వచ్చిన తమ స్నేహబంధాన్ని పార్టీలు తెంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా.. ఎలక్షన్ల తరువాత వస్తున్న ఫలితాలు అంతుపట్టకుండా వున్నాయి. ఒకవైపు బీజేపీ మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుండగా.. సీఎంగా పదవీబాధ్యతలు చేపడుదామని భావించిన ఉద్ధవ్ ఠాక్రే ఆశలు నీరుగారిపోయాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఐతే మరీ ఘోరంగా వుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇంకా గందరగోళ పరిస్థితియే నెలకొని వుంది. బీజేపీ ఏ పార్టీతోనైనా పొత్తుపెట్టుకుంటే అధికారం చేతికి దక్కదు.. కానీ ఏ పార్టీలు బీజేపీతో చేతులు కలపడానికి సుముఖుత చూపడం లేదు. ఈ విషయం ఏమవుతుందో త్వరలోనే తేలనుంది.
ఇకపోతే.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి కొన్ని ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఎంఐఎం పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టిస్తే... తెలుగుతేజం ద్వారంపూడి మల్లికార్జునరామిరెడ్డి చరిత్రకెక్కారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామానికి చెందిన మల్లికార్జునరామిరెడ్డి రామ్ టెక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఒక సాధారణ కాంట్రాక్టర్ అయిన ఈయన.. రామ్ టెక్ ప్రాంతంలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవ, ప్రజాసేవ ద్వారా అక్కడి ప్రజలతో మమేకమయిపోయారు. దీంతో ఎన్నికల్లో పోటీచేసిన ఆయనకు ఓటర్లు ఆయన మీద నమ్మకంతో గెలిపించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more