తెలంగాణలో చీకట్లు తెలగిపోనున్నాయి. తాత్కాలికంగా అలుముకున్న తిమిరాలు హరించుకుపోనున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తీరే మార్గం కనిపించింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కూడా కుదిరితే విద్యుత్ వచ్చేందుకు వీలవుతుంది. గతంలో ఛత్తీస్గఢ్తో మొదలైన చర్చలను పునరుద్ధరించేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. ఆ ప్రభుత్వం కూడా విద్యుత్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా లైను (కారిడార్) లేకపోవడం కూడా ఓ సమస్యగా మారింది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని, కారిడార్ నిర్మించుకోవడం, లేదా మరేదైనా మార్గం ద్వారా విద్యుత్తు తెప్పించుకోవడం చేయాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా అధికంగా విద్యుత్ సరఫరాను అందిస్తున్నా.. రోజురోజుకు డిమాండ్ పెరగడంతో ఎంత విద్యుత్ను తీసుకువచ్చినా.. సరిపోవడం లేదని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విద్యుత్ డిమాండ్ అధికమవ్వడంతో హైదరాబాద్ నగరం సహా తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు తీవ్రంగా అమలవుతున్నాయి. నగరంలో 4 గంటలు, మండల కేంద్రాల్లో ఎనమిది గంటలు, గ్రామాల్లో అయితే దాదాపు కేవలం ఆరు గంటల విద్యత్.. అదీ విడదల వారీగా అందిస్తున్నారు. విద్యుత్ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించలేక పోతోందని ప్రతిపక్షాల విమర్శలు, అంధోళనలు కూడా మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యత్ సరఫరా అయిన నేపథ్యంలో తెలంగాణలో కరెంటు కష్టాలకు కళ్లెం పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ ను 7-8 రూపాయల చొప్పున కొంటున్నా, అది ఏమాత్రం సరిపోవట్లేదు. కాగా విద్యత్ చార్జీలను కూడా ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని భావిస్తుంది. అనేక చోట్ల విద్యత్ అక్రమంగా వాడుతున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more