Horifying hudhud cyclone waves creates terror jc runs away

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, waves, terror, fishing harbor, compound wall, collapses

Horifying hudhud cyclone waves creates terror, jc runs away as fishing harbour compound wall collapses

అలల ఉద్దృతికి పరుగులు తీసిన జేసీ

Posted: 10/12/2014 10:55 AM IST
Horifying hudhud cyclone waves creates terror jc runs away

భీకరంగా వస్తున్న తుఫాను విశాఖ నగరంలో తీరం దాటవచ్చని వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందు వెళ్లిన విశాఖ జాయింట్ కలెక్టర్ (జేసీ) ప్రవీణ్ కుమార్ విశాఖ ఫిషింగ్ హర్బర్ వద్దకు చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్‌లో అప్పటికే అలల ఉద్ధృతికి రక్షణ గోడ కూలిపోయింది. గత అక్టోబరులో పై-లిన్ తుపానుకి కూడా ఇదే గోడ కూలిపోయింది. దీంతో కూలిన రక్షణ గోడ వద్ద నిల్చోని పరిస్థితిని సమీక్షిస్తున్న జేసీకి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు వచ్చి తాకాయి. వాటి తాకిడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రవీణ్ కుమార్ పరుడుతు తీయాల్సి వచ్చింది. అయితే ఆయనతో పాటు అక్కడే వున్న ఆయన సిబ్బందికి కూడా ఇదే పరిస్థతి ఎదురైంది. ఇక అక్కడ వుండలేమనుకున్న జేసీ వాటి నుంచి కొంత దూరానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు.

ఇదిలావుండగా, యారాడ, ఆర్కేబీచ్, రుషికొండ, భీమునిపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది. లోతట్టు ప్రాంతాల్లో నివశించే కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. విశాఖ నుంచి వెళ్లే బస్సు, రైళ్లు, విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేశారు. జాతీయ రహదారుల్లో నిన్నరాత్రి 7 గంటల తరువాత వాహన రాకపోకలు నిలిచి పోయాయి. తీర గ్రామాలకు సాయంత్రం 5 తరువాత బస్సులు నిలిపివేశారు. జాతీయ రహదారిపై మరో 45 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. గాలులతో పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more