First ebola death recorded in america

first death, ebola, recorded, america

first ebola death recorded in america

అగ్రరాజ్యం అమెరికాలో తొలి ఎబోలా మరణం..

Posted: 10/09/2014 05:47 PM IST
First ebola death recorded in america

దక్షిణాఫ్రికా తరువాత అగ్రరాజ్యం అమెరికాను ఎబోలా వ్యాధి కలకలం రేపుతోంది. గట్టి భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ అమెరికాలో ఎబోలా వ్యాధి సోకి ఒక వ్యక్తి మరణించాడు. అమెరికాలోనూ ఎబోలా వ్యాధితో తొలి మరణం చోటుచేసుకోవడంపై అక్కడి పౌరులు ఆందోళన చెందుతున్నారు. లిబిరియా జాతీయుడు థామస్‌ ఎరిక్‌ డంకన్‌.. ఎబోలా వైరస్‌ వ్యాధితో మృతి చెందాడు. అమెరికాలో ఈ వైరస్‌ సోకి దానికి బలైన తొలి వ్యక్తి మృత్యువు నమోదు కావడంతో అమెరికన్లలో అందోళన మొదలైంది.

సెప్టెంబర్‌ చివరి వారంలో థామస్‌ ఎరిక్‌ డంకన్‌ (42) అనే వ్యక్తి అమెరికాలోని టెక్సాస్‌ రాష్ర్టానికి వచ్చిన కొన్ని రోజులకే ఎబోలా వైరస్‌ సోకింది. అతన్ని డల్లాస్‌లోని టెక్సాస్‌ హెల్త్‌ ప్రెస్‌ బిటెరియన్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో రెండు వారాల పాటు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో డంకన్ మృతి చెందారు. కాగా ఎబోలా వైరస్‌ను నిర్వీర్యం చేయడానికి తోడ్పడే టార్గెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్‌లోని బలహీన ప్రాంతాన్ని గుర్తించిన యూనివర్సీటీ ఆఫ్‌ అటావా పరిశోధకులు పరమాణువును రూపొందించారు. దీని సాయంతో వైరస్‌ నిర్మూలన మందులను తయారు చేయొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : first death  ebola  recorded  america  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more