No relation ship between those two

ap capital, farmers lands, sujana chowdary, loan waiver, no relation, penamaluru

tdp mp sujana chowdary visits pedana penamaluru constituency

ఆ రెండింటికీ సంబంధమే లేదు..

Posted: 10/06/2014 11:42 AM IST
No relation ship between those two

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాజధీని కోసం రైతులు తమ భూములను ఇచ్చేందుకు సిద్దంగా వున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత కూడా.. అసలు ఆ రెండింటికీ సంబంధమే లేదని అంటున్నారు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి. అవునండీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి, రైతుల భూములకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడున్న పోరంబోకు, కొండ పొరంబోకు భూములన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా.. రైతులు భూములు తీసుకుంటే గాని రాజధాని నిర్మాణం జరగని పరిస్థతి.

మరి సుజనా చౌదరి మాత్రం ఇలా ఎందుకన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులు అంధోళన చెందకుండా సుజనాచౌదరి ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక దీని వెనక మరేదైనా మతలబు వుందా అని రైతులు ఆరా తీస్తున్నారు. పైపెచ్చు.. రాజధానికి భూములు ఇచ్చే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి మెరుగైన ప్రయోజనం కోసం ప్యాకేజీ అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ ..ఈనెల 15వ తేదీలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఆ తర్వాత రైతులకు కొత్తరుణాలు కూడా మంజూరు అవుతాయని సుజనా చౌదరి అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital  farmers lands  sujana chowdary  loan waiver  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more