Cloud data center will be arrange in hyderabad

microsoft ceo satya nadella, satya nadella latest news, cm kcr news, satya nadella kcr news, microsoft company, hyderabad city, trs party

after microsoft ceo and kcr meeting.. it has been know that cloud data center will be arrange in hyderabad

హైదరాబాద్ సిటీకి మరో బంపరాఫర్!

Posted: 10/03/2014 09:25 PM IST
Cloud data center will be arrange in hyderabad

విభజనం అనంతరం హైదరాబాద్ నగరం నుంచి ఐటీ హబ్ ఓ మోస్తరు ఖాళీ అవుతోందంటూ అప్పట్లో బాగానే ప్రచారాలు జరిగాయి. కొన్ని కంపెనీలు కూడా వెనక్కు వెళ్లిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటివేమీ జరగలేదని, హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలు సవ్యంగానే వున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. అలాగే భాగ్యనగరాన్ని ప్రపంచంలో స్థాయిలో చాలా గొప్పగా తయారుచేస్తామంటూ సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు వ్యాఖ్యానాలు చేశారు. ఇక్కడ బిజినెస్ వ్యవహారాల గురించి ఇతర దేశాలకు చెందినవారితోపాటు మన దేశంలో వున్న ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా సమావేశమయ్యారు. వాటి ఫలితాలు ఎలావున్నా.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మొదలవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇటీవలే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాద్‌‌కు వచ్చి కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే! ఈ భేటీలో ఏ విషయాల గురించి చర్చలు జరిగాయన్న విషయం మీద ప్రభుత్వం ప్రెస్‌నోట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు కానీ.. ఒక ముఖ్యమైన అంశం చర్చకు వచ్చిందని.. అందులో ఇరువర్గాలు ఓ అంగీకారానికి వచ్చాయని సమాచారం. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ క్లౌడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు చాలా వున్నాయని ఓ ప్రతిపాదన వెలువడుతోంది.

దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో ఇలాంటి సెంటర్లు ఏర్పడుతాయని ఇదివరకే సత్య ప్రకటించారు కూడా! కానీ ఆ నగరాలేవో వెల్లడించలేదు. అయితే కేసీఆర్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ సెంటర్ ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖుత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారాలు వస్తున్నాయి.అయితే ఇంకా ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. భూకేటాయింపులు, ఒప్పందాలు పూర్తి అయిన తరువాత ప్రకటనను విడుదల చేయాలనే ప్లాన్‌లో వున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సెంటర్ హైదరాబాద్‌లో పడితే.. ఇక ఐటీ రంగంలో వున్నవారికి పండగే పండగ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : microsoft ceo satya nadella  microsoft  kcr  hyderabad it hub  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more