అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మరోమారు కర్ణాటక హైకోర్టు చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ విచారణకు స్వీకరించింది. పురచ్చితలైవి బెయిల్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. జయలలిత బెయిల్ పిటీషన్ పై విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.
బెయిల్ వస్తుందని ఎంతో ఆశగా వేచిచూసిన జయలలితకు మరోసారి నిరాశే ఎదురైంది. జయలలిత బెయిల్ పిటీషన్ ను ప్రత్యేక న్యాయస్థానంలో విచారించలేమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో జయకు బెయిల్ ఇవ్వటం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల ఏడో తేదీన హైకోర్టు సాధారణ బెంచ్లో విచారణకు ఆదేశించింది. మరోవైపు కోర్టు తాజా తీర్పుతో జయలలితతో పాటు అన్నాడీఎంకే వర్గాలకు మళ్లీ నిరాశకు లోనయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పరప్పన అగ్రహర జైలు గది ఈ దసారకు జయలలితకు విడిది ఇవ్వనుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు, మంత్రుల మధ్య జరగాల్సిన జయలలిత దసరా వేడుకలు జైలులో గడవనున్నాయి. కార్యకర్తలు, అభిమానులు ఎవరూ అధైర్య పడవద్దని, ఈ నెల 7న తమ అధినేత్రి బెయిల్ పై బయటకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more