Minor girl gangrape 5 accused arrested

gang rape, gajapathinagaram, vizianagaram district, arrest, remand, accused

minor girl gangrape, 5 accused arrested in vizianagaram district

కటకటాల్లో విజయనగరం కామాంధులు..

Posted: 09/30/2014 10:49 AM IST
Minor girl gangrape 5 accused arrested

స్నానం చేస్తున్న మైనర్ బాలిక వీడియో తీసి.. బెదిరింపులకు గురిచేసి.. సామూహిక అత్యాచారానికి  పాల్పడిన ఐదుగురు సభ్యుల గ్యాంగ్‌ను  విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గజపతి మండలం పురిటిపెంటకు చెందిన బాలిక స్నానం చేస్తుండగా అదే  గ్రామానికి చెందిన శివాజీ నాయక్‌ అనే  యువకుడు వీడియో తీశాడు. దీన్ని అడ్డుపెట్టుకుని తన కోరిక తీర్చాలని లేని పక్షంలో వీడియోను నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. తీవ్ర ఒత్తిడి పెరగడంతో శివాజీ నాయక్ కు లొంగిపోయిన బాలికను అనుభవించాడు. అది చాలదన్నట్లు.. తన స్నేహితులతో కలిసి బాలికపై పలు సార్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు.

గ్యాంగ్ నుంచి బెదిరింపులు, అత్యాచారం పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక.. మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. బాలిక ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు శివాజి నాయక్‌తో పాటు గ్యాంగ్ రేప్, బెదిరింపులకు పాల్పడ్డ నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.  నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape  gajapathinagaram  vizianagaram district  arrest  remand  accused  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more