తమిళనాడులో రెండు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కేంద్రాన్ని కోరారు. జయలలితకు జైలుశిక్ష నేపథ్యంలో తమిళనాడు అగ్నిగుండంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సామాన్య వ్యక్తిగానే జయలలితపై ఫిర్యాదు చేశానని సుబ్రమణ్యం స్వామి అన్నారు. తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై కోర్టు వెలువరించిన తీర్పుపై ఆయన స్పందిస్తూ.. నాకు క్లీన్ చిట్ ఇచ్చిన అనుభూతిని పోందుతున్నాను.. ఇకపై అమె ప్రజల నమ్మకాన్ని తిరిగి సాధించలేరని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెకు అంత శిక్ష పడుతుందని తాను కూడా ఊహించలేదన్నారు. సామాన్యుడు కూడా అవినీతి, అక్రమాలను ప్రశ్నించవచ్చనే దానికి ఈ కేసు ఉదాహరణ అన్నారు. తనపై చాలా దాడులు జరిగాయని అయినా తాను భయపడలేదని సుబ్రమణ్యం స్వామి తెలిపారు. ఇక జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్లేనని ఆయన అన్నారు. అంతకు ముందు సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్లో జయలలిత జైలుకే ...జేజే అంటూ ట్విట్ చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more